Mahaa Daily Exclusive

  అమెజాన్‌లో 30 వేల మంది ఔట్ ….2022 తర్వాత తొలగింపు ఇదే అత్యధికం

Share

ఇంటర్నెట్ డెస్క్, మహా: దిగ్గజ్‌ టెక్‌ సంస్థ అమెజాన్‌.. ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది. మంగళవారం నుంచి దాదాపు 30వేల కార్పొరేట్‌ ఉద్యోగాలకు కోత పెట్టనున్నది. కొవిడ్‌ విశ్వమారి సమయంలో డిమాండ్‌ పీక్‌ స్టేజ్‌లో ఉండటంతో అమెజాన్‌ కంపెనీ లెక్కకు మించి ఉద్యోగులను నియమించుకున్నది. ఇప్పుడు అంత మంది అవసరం లేకపోవడంతో ఉద్యోగాల్లో కోత పెట్టేందుకు, పనిలోపనిగా ఖర్చులు తగ్గించుకునేందుకు అమెజాన్‌ సిద్ధమైందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 15లక్షలకుపైగా ఉద్యోగులు ఉన్న అమెజాన్‌ కంపెనీలో 3.50 లక్షల మంది కార్పొరేట్‌ ఎంప్లాయీస్‌ ఉన్నారు. వారిలో సుమారుగా పదిశాతం మందిని తొలగించేందుకు రంగం సిద్ధమైందని చెబుతున్నారు. అమెజాన్‌ ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించడం 2022 తర్వాత ఇదే మొదటిసారి. ఆ సమయంలో సుమారు 27 వేల మందిని అమెజాన్‌ తొలగించింది. దీనిపై స్పందించేందుకు అమెజాన్‌ అధికార ప్రతినిధి నిరాకరించారు. డివైసెస్‌, కమ్యూనికేషన్స్‌, పాడ్‌కాస్టింగ్‌ సహా వివిధ రంగాల్లో చిన్న చిన్న సంఖ్యల్లో ఉద్యోగులను అమెజాన్‌ గత రెండేళ్లుగా తొలగిస్తూ వస్తున్నది. తాజాగా చేపట్టిన తొలగింపులతో మానవ వనరులు (పీపుల్‌ ఎక్స్‌పీరియన్స్‌ టెక్నాలజీ లేదా పీఎక్స్‌టీ), అమెజాన్‌ వెబ్‌సర్వీసెస్‌ వంటి రంగాల్లో కొంత ప్రభావం కనిపిస్తుందనే అభిప్రాయాలను ఈ విషయంలో సమాచారం ఉన్న వారు చెబుతున్నారు

Latest