Mahaa Daily Exclusive

  నయనతార .. ఆల్ టైమ్ రికార్డ్ చేతిలో 9 సినిమాలు

Share

మహా
40 ప్లస్ వయసులోనూ నయనతార అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నాయికల్లో ఆమె ఒకరు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంలో నటిస్తున్న నయనతార, ఈ సినిమా కోసం ఏకంగా 18 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసినట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. నయన్ క్రేజ్‌కి నిదర్శనంగా, ఆమె చేతిలో ప్రస్తుతం దాదాపు 9 సినిమాలు ఉన్నట్లు సమాచారం. అందులో తమిళంలో 4, మలయాళంలో 2, తెలుగులో (చిరు సినిమాతో కలిపి) 2, కన్నడలో 1 సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నాలుగోసారి బాలయ్యకు జోడీగా నయనతార తెరపై కనిపిస్తే, పది సినిమాలు ఉన్నట్లు అవుతుంది. నయనతార ఎన్నడూలేని రీతిలో చిరుమూవీ ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటున్నారు.

Latest