Mahaa Daily Exclusive

  ఓటేస్తామంటే మోదీ డ్యాన్స్ కైనా రెడీ:రాహుల్ గాంధీ

Share

  • ఓటేస్తామంటే మోదీ డ్యాన్స్ కైనా రెడీ
  • బిహార్‌లో బీజేపీ రిమోట్‌ కంట్రోల్‌ సర్కార్
  • దేశసంపద కొంతమంది సంపన్నుల చేతుల్లోకి వెళ్లిపోతోంది
  • ప్రధాని మోదీపై ఎంపీ రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్

బిహార్, మహా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ బుధవారం శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘ఓట్ల కోసం ఆయన ఏదైనా చేస్తారు’ అంటూ విమర్శలు గుప్పించారు. ‘మహాగట్‌బంధన్’ తరఫున ముజఫర్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, అధికార బీజేపీ ఎన్నికల చోరీకి పాల్పడుతోందని విమర్శించారు. ఓటరు కార్డుల అవకతవకలు, ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఎన్నికల కమిషన్‌తో బీజేపీ కుమ్మక్కయిందని ఆరోపించారు. ‘ఆయనకు (మోదీ) మీ ఓట్లు మాత్రమే కావాలి. మీ ఓట్లకు బదులుగా ఆయనను డాన్స్ చేయమని చెబితే, ఆయన వెంటనే డాన్స్ చేస్తారు. వాళ్లు మహారాష్ట్రలో ఎన్నికల చోరీకి పాల్పడ్డారు. హర్యానాలోనూ ఇదే పని చేశారు. ఇప్పుడు బీహార్‌లో ఎన్నికల చోరీకి ప్రయత్నిస్తున్నారు’ అని రాహుల్ అన్నారు. ఢిల్లీలో కాలుష్యంతో నిండిన యమునా నది ఒడ్డున ప్రత్యేకంగా ఒక చెరువు నిర్మించినట్టు వస్తున్న వార్తలపైనా రాహుల్ స్పందించారు. ‘అక్కడ యమున లేదు. చెరువు మాత్రమే ఉంది. ఫిల్టర్ వాటర్ నింపారు. ప్రధానమంత్రి తన స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేయడానికి వెళ్లారు. సామాన్య ప్రజానీకం మాత్రం యమునా నది మురికి జలాల్లో ఛాత్ ప్రార్థనలు చేస్తున్నారు. ఆయనకు యుమునా నదితో సంబంధం లేదు. ఛత్ పూజతో సంబంధం లేదు. ఆయనకు మీ ఓటు మాత్రమే కావాలి’ అని రాహుల్ వ్యంగ్యోక్తులు గుప్పించారు.

రూ.500కే సిలిండర్: తేజస్వీ యాదవ్‌
తాము అధికారంలోకి వస్తే రూ.500కే వంటగ్యాస్‌ సిలిండర్లు అందజేస్తామని ఆర్జేడీ నేత, ‘మహాగఠ్‌బంధన్‌’ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ ప్రకటించారు. ఇటీవల కాలంలో ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకున్న అనేక ప్రజాకర్షక చర్యలు.. గతంలో తాను ఇచ్చిన హామీలకు నకలు అని విమర్శించారు. బయటి వ్యక్తుల నియంత్రణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. అవినీతి, శాంతిభద్రతలపై రాజీలేని వైఖరిని అవలంబిస్తానని తెలిపారు

Latest