Mahaa Daily Exclusive

  విద్యార్థులకు శుభవార్త..

Share

  • విద్యార్థులకు శుభవార్త
  • రూ. 303 కోట్ల ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిలు రిలీజ్
  • 2022 నుంచి ఉన్న పెండింగ్‌ను క్లియర్ చేయాలని భట్టి ఆదేశం

హైదరాబాద్, మహా: పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి, మైనారిటీ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ బకాయిలు 303 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ బకాయిల మొత్తాన్ని ఒకేసారి క్లియర్ చేయాలని ఆదేశించారు. నిరాశ, నిస్పృహల్లో ఉన్న వేల కుటుంబాల్లో డిప్యూటీ సీఎం ఆదేశాలు ఆనందం నింపాయి. కష్టకాలంలో ప్రభుత్వం ప్రతి విద్యార్థికి సుమారు 20 లక్షల ఆర్థిక సహాయం అందించడంతో తమ బిడ్డలు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని, తమ ఇబ్బందులు తొలగిపోతాయని ఆ కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కష్టకాలంలో ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించి రాష్ట్రానికి, దేశానికి తిరిగి అర్థవంతమైన సేవలు అందించే అవకాశం కలుగుతుందని ఆశాభావంతో ఉన్నట్టు ఓవర్సీస్ విద్యార్థులు తెలిపారు.

Latest