- తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీలకు షాక్
- ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు
- పోలీస్, విద్యాశాఖ అధికారులు సహకారంతో తనిఖీలు
హైదరాబాద్, మహా
ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ఇంజినీరింగ్ సహా ఉన్నత విద్యా కాలేజీలకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో విజిలెన్స్ తనిఖీలకు ఆదేశించింది. అన్ని కాలేజీల్లోనూ తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేసింది. పోలీస్, విద్యాశాఖ అధికారులు సహకారంతో తనిఖీలు చేపట్టి, నివేదిక సమర్పించాలని సూచించింది. మరోవైపు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆరోపిస్తూ తెలంగాణలోని అన్ని ప్రయివేట్ ఉన్నత విద్యా సంస్థలు నవంబరు 3 నుంచి కాలేజీలను మూసివేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విజిలెన్స్ తనిఖీలకు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో సర్కారు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం, గతంలో ఇచ్చినవాటిని నెరవేర్చకపోవడంతో ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య బంద్‌కు పిలుపునిచ్చింది. దసరాకు రూ. 600 కోట్లు విడుదల చేస్తామని, కేవలం రూ. 200 కోట్లతో సరిపెట్టింది. దీపావళి నాటికి మొత్తం బకాయిలు క్లియర్ చేస్తామని చెప్పినా ఆ హామీ కూడా నెరవేరలేదు. దీంతో తక్షణమే బకాయిల విడుదలపై స్పష్టత ఇవ్వాలని కాలేజీల సమాఖ్య డిమాండ్ చేస్తోంది. దాని ప్రతినిధులు మంత్రులను కలిసి తమ సమస్యను వివరించాయి. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో బంద్‌ను ఎంచుకున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో గత ప్రభుత్వ హయాంలోనే విచారణకు ఆదేశించింది. ఇటీవల ప్రయివేట్ కాలేజీల యాజమాన్యాలతో జరిగిన చర్చల్లో ఈ అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావించింది







