హైదరాబాద్, మహా
జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ రసవత్తర రాజకీయాలకు తెరలేపింది. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పటికే డిసైడ్ అయిన హైకమాండ్.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా కేబినెట్లోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. తద్వారా ఎన్నికలకు ముందు ఆయనకు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. తద్వారా కొన్ని రోజులుగా ఆయన వ్యక్తం చేస్తున్న అసంతృప్తిని చల్లార్చినట్లు అవుతుందని పార్టీ పెద్దలు అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. శుక్రవారం తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. మాజీ ఎంపీ అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. దీంతో ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక రాజగోపాల్ రెడ్డి కేబినెట్ లోకి రావడం ఖాయమని, ఆయన విద్యాశాఖ ఇస్తారనే ప్రచారాలు జరుగుతున్నాయి.







