Mahaa Daily Exclusive

  ఇండియాలో తొలి డ్రైవర్ లెస్ కార్ రెడీ

Share

  • ఇండియాలో తొలి డ్రైవర్ లెస్ కార్ రెడీ
  • విప్రో సహకారంతో నిర్మాణం
  • బెంగళూరులో ఫస్ట్ లుక్

బెంగళూరు :
భారతీయ రోడ్ల సవాళ్లను ఎదుర్కొనేలా రూపొందించిన డ్రైవర్‌లెస్ కార్‌ను విప్రో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), ఆర్‌వీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (RVCE) కలిసి తయారు చేశారు. ‘విరిన్’ పేరుతో ఈ వాహనాన్ని అక్టోబర్ 27న ఆర్వీసీఈ క్యాంపస్‌లో పరిచయం చేశారు. ఈ ఆవిష్కరణ ఆరు సంవత్సరాల కృషి ఫలితం. గంతలు, పశువులు, ట్రాఫిక్ రద్దీ వంటి భారతీయ రోడ్ల సమస్యలకు అనుగుణంగా రూపొందించిన ఈ కార్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేస్తుంది. ఆర్వీసీఈ క్యాంపస్‌లో జరిగిన పరిచయ కార్యక్రమానికి విప్రో ఆటోనమస్ సిస్టమ్స్ అండ్ రోబోటిక్స్ గ్లోబల్ హెడ్ రామచంద్ర బుధిహల్, రాష్ట్రీయ శిక్షణ సమితి ట్రస్ట్ అధ్యక్షుడు ఎంపీ శ్యామ్, ప్రిన్సిపల్ కెఎన్ సుబ్రమణ్యలు పాల్గొన్నారు. ఈ కార్‌లో ఉత్తరాడి మఠాధిపతి కూర్చుని ప్రయాణించిన 28 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

Latest