Mahaa Daily Exclusive

  కోడ్ ఉల్లంఘించిన సీఎం రేవంత్…

Share

  • కోడ్ ఉల్లంఘించిన సీఎం రేవంత్
  • మంత్రివర్గ విస్తరణను ఆపాలని ఈసీకి బీజేపీ ఫిర్యాదు

హైదరాబాద్, మహా : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మర్రి శశిధర్ రెడ్డితో పలువురు బీజేపీ ప్రతినిధులు ఎన్నికల అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘించారని ఆరోపించారు. ఇలా మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఒక వర్గం ఓట్లు ప్రభావితం అవుతాయన్నారు. మంత్రివర్గ విస్తరణపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఒక వర్గానికి మంత్రి పదవి ఇచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారంటూ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఫైర్ అయ్యారు.

ఒకవేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే ఎన్నిక తర్వాత ఇవ్వాలి. కానీ ఉన్నఫళంగా మంత్రివర్గ విస్తరణ చేయడం, అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం వెనక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఈ అంశాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. మర్రి శషిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల లబ్ది కోసం ఒక వర్గం ఓట్లు కోసం అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారన్నారు. ఆ వర్గంపై ప్రేమ ఉంటే గతంలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మంత్రి పదవి ఆశ చూపి ఆ వర్గాన్ని మోసం చేయాలని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. కోడ్ ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకోవాలంటూ కోరామన్నారు. సినీ కార్మికుల ను ప్రభావితం చేసేలా ప్రకటనలు చేయడం కోడ్ ఉల్లంఘనే అవుతుందన్నారు

Latest