Mahaa Daily Exclusive

  230 కిలోమీటర్లు దెబ్బతిన్న రహదారులు :మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Share

హైదరాబాద్, మహా : తుపాను కారణంగా 230 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రోడ్లు, భవనాలశాఖ పూర్తి అప్రమత్తతతో ఉందన్నారు. ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, కాజ్‌వేల పునరుద్ధరణకు రూ. 7 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. దెబ్బతిన్న రోడ్లను శాశ్వత పునరుద్ధరణకు రూ.225 కోట్లు అవసరమని వివరించారు. తుపాను వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీవ్ర నష్టం జరిగిందని మంత్రి తెలిపారు. వేల ఎకరాల్లో పత్తి, వరి పంటలు దెబ్బతిన్నట్లు వివరించారు. ఐకేపీ సెంటర్లలో దాదాపు 2 లక్షల టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయని, పత్తి తేమ శాతం గురించి ఇప్పటికే సీసీఐ ఛైర్మన్​ను కలిశానని చెప్పారు. నిబంధన సడలించాలని రైతుల పక్షాన ముంబయికి వెళ్లి విజ్ఞప్తి చేశానని ఆయన వివరించారు

Latest