Mahaa Daily Exclusive

  కోతకు గురైన హైదరాబాద్ – శ్రీశైలం హైవే

Share

  • డిండి వరద భీబత్సం
  • కోతకు గురైన హైదరాబాద్ – శ్రీశైలం హైవే
  • వాహనాలను దారి మళ్ళించిన పోలీసులు

హైదరాబాద్, మహా : తుపాను ప్రభావం తెలంగాణపై తీవ్రంగా పడింది. డిండి రిజర్వాయర్​ వరద ఉద్ధృతితో జాతీయ రహదారి కోతకు గురైంది. దీంతో హైదరాబాద్​-శ్రీశైలం నేషనల్​ హైవేపై వాహనాలను ట్రాఫిక్​ పోలీసులు దారి మళ్లిస్తున్నారు. నాగర్​ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్​ వద్ద జాతీయ రహదారి కోతకు గురైంది. గురువారం సాయంత్రం నుంచి సమీప ప్రాంతాల మీదుగా వాహనాలను దారి మళ్ళిస్తున్నారు. శ్రీశైలం నుంచి వచ్చే వాహనాలు హజీపూర్, డిండి చింతపల్లి, కొండారెడ్డిపల్లి మీదుగా పంపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను కల్వకుర్తి మీదుగా మళ్లించారు. అలా కొండారెడ్డిపల్లి, డిండి, చింతపల్లి, హజీపూర్​ మీదుగా దారి మళ్లిస్తున్నారు. డిండి ప్రాజెక్టు వరద ఉద్ధృతితో ట్రాన్స్​ఫార్మర్​ దెబ్బతింది. వరద ఉద్ధృతితో పలుచోట్ల విద్యుత్​ స్తంభాలు నేలకొరిగాయి. వరద ఉద్ధృతికి పలు చోట్ల ట్రాన్స్​ఫార్మర్లు కొట్టుకుపోయాయి. అచ్చంపేట సబ్​స్టేషన్​ నుంచి డిండి సబ్​స్టేషన్​కు విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. ఆకారం, కంబాలపల్లి సబ్​స్టేషన్​ పరిధిలో 350 స్తంభాలు దెబ్బతిన్నాయి. డిండి సబ్​స్టేషన్​లో విద్యుత్​ పునరుద్ధరణకు అధికారులు చర్యలు చేపట్టారు

Latest