Mahaa Daily Exclusive

  అజహరుద్దీన్ పై బీజేపీ కుట్ర….

Share

  • అజహరుద్దీన్ పై బీజేపీ కుట్ర
  • లోపాయికారిగా బీఆర్ఎస్ తో చేతులు కలిపిన కాషాయ పార్టీ
  • మంత్రి కాకుండా అడ్డుకుంటున్న రెండు పార్టీలు
  • టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపాటు

నిజామాబాద్, మహా : అజారుద్దీన్ మంత్రి కాకుండా బీజేపీ కుట్ర చేస్తుందని ఇందుకు బీఆర్ఎస్ సైతం లోపాయికారి చేతులు కలిపిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో గురువారం ఏర్పాటు చెందిన మీడియా సమావేశం లో మాట్లాడుతూ క్యాబినెట్ లో మైనార్టీకి ప్రాతినిధ్యం కలిపించాలనే ఉద్దేశ్యంతో ప్రఖ్యాత క్రికెటర్ అజారుద్దిన్ ను మంత్రి మండలిలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావించిందని మహేష్ కుమార్ పేర్కొన్నారు. గతంలో బీజేపీ రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లా శ్రీ కరణ్ పూర్ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భఁగా బీజేపీ అభ్యర్థిగా ఉన్న సురేంద్ర పాల్ సింగ్ ను క్యాబినెట్ లో మంత్రిగా చేశారని గుర్తు చేశారు. ఉప ఎన్నిక అభ్యర్థిని మంత్రిగా చేస్తే తప్పులేనిది అజారుద్దీన్ ను మంత్రిని చేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. అజారుద్దీన్ ను కేబినేట్ లోకి తీసుకోవాలని సీఎం భావిస్తే దాన్ని అడ్డుకునేందుకు బీజేపీ కుటీల ప్రయత్నం చేస్తోందనీ మండిపడ్డారు. క్రీడా ప్రపంచానికే కాదు ఎంపీగా అజారుద్దీన్ ప్రజలకు సేవలందించారన్నారు. అజారుద్దీన్ ను మంత్రి కాకుండా ఎలక్షన్ కమిషన్ కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడం విచారకరమన్నారు. అనైతికంగా అజారుద్దీన్ మంత్రి కాకుండా బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అజారుద్దీన్ తో ప్రమాణ స్వీకారం చేయించకుండా రాష్ట్ర గవర్నర్ పైన బీజేపీ ఒత్తిడి తీసుకువస్తోందన్న సమాచారం కూడా ఉందని తెలిపారు. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని కేసీఆర్ కూతురు కవిత స్వయంగా చెప్పారని టీ పీసీసీ చీఫ్ గుర్తు చేశారు. మైనార్టీలకు లబ్ది చేకూరుతుందనే ఉద్దేశ్యంతోనే అజారుద్దీన్ ప్రమాణ స్వీకారాన్ని బీజేపీ అడ్డుకుంటోందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు విజ్నులు, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. అజారుద్దీన్, కోదండరాంలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసి కేబినేట్ గవర్నర్ కి పంపింది. అక్కడ పెండింగ్ లో ఉందన్నారు. కోర్టులో గెలిచి తీరుతామన్న నమ్మకముందన్నారు. అజారుద్దీన్ కేబినేట్ లోకి రావడం ఖాయమని మహేష్ కుమార్ గౌడ్ ఖరాఖండిగా పేర్కొన్నారు.

Latest