Mahaa Daily Exclusive

  ఫైనల్‌కు టీమిండియా…

Share

  • ఫైనల్‌కు టీమిండియా
  • ప్రపంచకప్‌ సెమీస్‌లో ఆసీస్ చిత్తు
  • ఆస్ట్రేలియాపై టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం
  • సెంచరీతో జెమీమా సత్తా.. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో అమీతూమీ

ముంబై, మహా: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా 5 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ లక్ష్యాన్ని భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జెమీమా రోడ్రిగ్స్‌ (127*), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (89) చెలరేగారు. నవంబర్‌ 2న ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడనుంది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ లీచ్ ఫీల్డ్ (119; 93 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడి సెంచరీ బాదింది. ఎలీస్ పెర్రీ (77; 88 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో రాణించగా.. ఆష్లీన్ గార్డ్‌నర్ (63; 45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చివర్లో మెరుపులు మెరిపించింది. బెత్ మూనీ (24), కిమ్ గార్త్ (17), తాహిలా మెక్‌గ్రాత్ (12) పరుగులు చేశారు. భారత బౌలర్లలో శ్రీ చరణి 2, దీప్తి శర్మ 2, క్రాంతి గౌడ్, అమన్‌జ్యోత్ కౌర్, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు

Latest