- ఎల్బీనగర్ లో ..ఓ.. ఫేక్ గ్యాంగ్ హల్చల్..!
- జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల పేరుతో వసూళ్లు..!
హైదరాబాద్, మహా : హైదరాబాద్ నడి బొడ్డున ఉండే ఎల్బీనగర్ లో ఇంటి నిర్మాణదారుల నుండి మామూళ్ళు వసూలు చేసే బ్యాచ్ రూట్ మార్చింది. టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలా వసూళ్లకు పాల్పడతారు అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన బ్యాచ్ సదురు ఇంటి నిర్మాణదారుడు చిన్న డివియేషన్ చేసిన వారిని ఫోన్లో సంప్రదించి బెదిరింపులకు పాల్పడుతుంది. అలాంటి బ్యాచ్ ఎల్బీనగర్ లో ప్రతిరోజు చక్కర్లు కొడుతుంది. అవినీతికి పాల్పడే టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా దీనిపై ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నట్టు తెలుస్తోంది. హయత్ నగర్ సర్కిల్ – 3 పరిధిలో జరిగే అక్రమ నిర్మాణాల వద్దకు వెళ్లి ఇంటి నిర్మాణదారులను భయభ్రాంతులకు గురి చేస్తుంది. చివరికి తామే బల్దియా అధికారులం అని చెప్పి ముడుపులు వసూలు చేస్తుంది. ఇదంతా తెలిసినా జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
సైబర్ నెరగాళ్లను మించిపోయారు..!
బల్దియా హయత్ నగర్ సర్కిల్ – 3 పరిధిలో వసూళ్ల బ్యాచ్ సైబర్ నేరగాలను మించిపోయారు. ఎక్కడ నిర్మాణం జరిగినా అక్కడ వాలిపోతున్నారు. జిహెచ్ఎంసి అధికారుల అలసత్వం, లంచగొండితనం వీరికి కాసులు కురిపిస్తుంది. చిన్న చిన్న డివియేషన్ ఉన్న సదురు నిర్మాణదారుడికి ఫోన్ చేసి భయపెడుతుంది. తాము జిహెచ్ఎంసి అధికారులమని చెప్తూ వసూళ్లకు పాల్పడుతుంది.
ఆశ్చర్యం కలిగించే సంఘటన..
ఎల్బీనగర్ హయత్ నగర్ సర్కిల్ – 3 పరిధిలోనీ వనస్థలిపురం డివిజన్ శ్రీనివాస కాలనీ లో ఓ నిర్మాణదారుడు ఇంటి నిర్మాణాన్ని చేపట్టాడు. అయితే.. ఓ వ్యక్తి సదురు నిర్మాణదారుడికి నీది అక్రమ నిర్మాణం తాము జిహెచ్ఎంసి నుండి వచ్చావని ఫోన్ చేసి భయపెట్టాడు. నీ నిర్మాణం జరగాలంటే తాను చెప్పిన నెంబర్ కి ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించాలని హుకుం జారీ చేశాడు. దీంతో భయపడ్డ సదురు నిర్మాణదారుడు రూ.26,500/- ఓసారి.. రూ 6,000/- లను ఓసారి ట్రాన్స్ఫర్ చేశాడు. ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తున్నాడని స్థానికులు అనుమానిస్తున్నారు.
బల్దియా అధికారులపై అనుమానాలు..!
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్న అన్ని సర్కిళ్లలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఈ అక్రమ నిర్మాణదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు కొత్త ఎత్తుగడ వేసారనే అనుమానాలు కలుగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులే ప్రైవేట్ వ్యక్తులను నియమించుకొని అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఏసీబీ దాడులు పెరిగిపోవడంతో జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులే ఓ ప్రైవేట్ బ్యాచ్ ఏర్పాటు చేసుకున్నట్లు కూడా వార్తలు గుప్పుమంటున్నాయి. ఇలాంటి బ్యాచ్ ని ఏర్పాటు చేసుకొని అక్రమ నిర్మాణాదారుల నుంచి వసూలు చేస్తున్నట్లు విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనిపై జిహెచ్ఎంసి విజిలెన్స్ అధికారులు, ఏసీబీ అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.







