Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌ వీధుల్లో రై.. రై..

Share

  • హైదరాబాద్‌ వీధుల్లో రై.. రై
  • నగరానికి 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
  • క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా నిలబెట్టడంతో మరో అడుగు

హైదరాబాద్, మహా: హైదరాబాద్ నగరంలో కాలుష్య రహిత రవాణా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుంది. పీఎం ఈ డ్రైవ్ కింద కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కి కేటాయిస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల ఆపరేషన్స్‌లో ఎదురయ్యే సవాళ్లు, మౌలిక సదుపాయాలపై స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిలతో కలిసి సెక్రటేరియట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రాజధాని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా నిలబెట్టడానికి డీజిల్ బస్సుల స్థానంలో పర్యావరణ హితమైన దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా పీఎం ఈ డ్రైవ్ కింద 9 నగరాల్లో 15 వేల ఎలక్ట్రిక్ బస్సులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అందులో తెలంగాణలో హైదరాబాద్ నగరానికి 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఒక్కో బస్సుకు 35 లక్షల రూపాయలు కేటాయిస్తుంది. ఈ బస్సులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నవంబర్ 6 వ తేదీ టెండర్లు పిలిచింది. ఎలక్ట్రిక్ బస్సులు ఆపరేట్ లో రాష్ట్రానికి కావల్సిన మౌలిక సౌకర్యాలు ,ఎదురవుతున్న ఇబ్బందులు, టెక్నికల్ ఆపరేషన్స్ పై సమీక్షా సమావేశంలో చర్చించారు.

ఇప్పటికే రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను మరింత ప్రోత్సహించడానికి 2-వీలర్స్ 3-వీలర్స్ , 4-వీలర్స్, బస్సులు, ట్రక్కులు ట్రాక్టర్లు వంటి ఇత్యాది వాహనాలకు పన్ను ప్రయోజనాలను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈవీ పాలసిని తీసుకొచ్చింది. 2019 మార్చిలో 40 యూనిట్లతో దేశంలోనే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. 2023 సేకరణ ప్రణాళిక కింద 1010 అదనపు ఎలక్ట్రిక్ బస్సులను (510 ఇంటర్‌సిటీ మరియు 500 సిటీ బస్సులు) చేర్చాలని టీజీఎస్ ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేయడంతో పాటు ఇప్పటికే లెటర్స్ ఆఫ్ అవార్డును జారీ చేసింది. ప్రస్తుతం, 775 ఎలక్ట్రిక్ బస్సులు (510 ఇంటర్‌సిటీ మరియు 265 సిటీ బస్సులు) నడుస్తున్నాయి. మిగిలిన 275 మార్చి 2026 నాటికి అందుబాటులోకి రానున్నట్లు ప్రాథమిక అంచనా వేసింది.

ఈ-బస్ రంగంలోని రెండు ప్రముఖ భారతీయ ఓఈఎంలతో టీజీఎస్ ఆర్టీసీ గణనీయమైన ఆపరేటింగ్ అనుభవాన్ని పొందింది. అయితే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీల ప్రతినిధులతో ఎదురవుతున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లింది. కొంతమంది ఆపరేటర్లు టెండర్ షరతులను పాటించకపోవడం. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో జాప్యం లాంటివి జరుగుతున్నాయి. e-బస్ డెలివరీలలో అసాధారణ జాప్యం. బ్రేక్‌డౌన్ ఫ్రీక్వెన్సీ పరంగా e-బస్‌ల పనితీరు తక్కువగా ఉండటం. డీజిల్ బస్సులతో పోలిస్తే సర్వీస్ రద్దు, ప్రమాద రేటు ఎక్కువ నమోదు లాంటివి జరుగుతున్నాయి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారంతో పాటు తగిన మద్దతు కై హామీ ఇస్తుంది. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద e-బస్‌ల సజావుగా ఆపరేషన్ జరిగేలా చర్యలు తీసుకుంటుంది.ఎంపిక చేసిన డిపోలలో అప్‌స్ట్రీమ్ హై-టెన్షన్ విద్యుత్ కనెక్షన్‌లను సకాలంలో ఏర్పాటు చేస్తుంది

Latest