Mahaa Daily Exclusive

  ఐఏఎస్ అధికారుల బదిలీలు….

Share

ఐఏఎస్ అధికారుల బదిలీలు
8 మందికి బదిలీలు, పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు
పథకాల అమలులో వేగం పెంచాలనే లక్ష్యంగా మార్పులు

హైదరాబాద్, మహా: రాష్ట్రంలో మరోసారి ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు, పదోన్నతులు చేపట్టింది సర్కార్. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు ఫ్లాగ్‌షిప్ అభివృద్ధి కార్యక్రమాల సమర్థవంతమైన అమలుకు అనుభవజ్ఞులైన అధికారులను కీలక విభాగాల్లో నియమించింది.

బదిలీలు, పదోన్నతులు..
=సబ్యసాచి ఘోష్: ‘ఫ్లాగ్‌షిప్ వెల్ఫేర్ స్కీమ్స్ యూనిట్’ అమలు కోసం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అదనంగా సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు.
=అనితా రామచంద్రన్: మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా కొనసాగుతూనే, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు.
=ఇలంబరితి కె: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఏ అండ్ యుడి) శాఖ కార్యదర్శి పదవి నుండి ప్రభుత్వ కార్యదర్శి పదవికి బదిలీ.
=బి. శ్రీధర్: బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పదవి నుంచి జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ (జీఏ విభాగం) కార్యదర్శిగా నియామకం.
=సైదులు: అభివృద్ధి సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు.
= జి.జితేందర్‌ రెడ్డి: ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా నియమించింది. అలాగే, ఎస్సీ సహకార సంస్థ ఎండీగా ఆయనకు అదనపు బాధ్యతలు.
=డా.యష్మీన్ బాషా: హార్టికల్చర్ డైరెక్టర్‌గా కొనసాగుతూనే, ఆమె టిజి ఆయిల్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు.
=ఎంఏ అండ్ యూడీ శాఖ కార్యదర్శి పూర్తి అదనపు బాధ్యతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుతోనే కొనసాగుతాయి.

పథకాల అమలులో వేగం..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ బదిలీలు.. బాధ్యతల పునర్విభజన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో సమతుల్యతను తీసుకురావడమే కాకుండా.. ముఖ్య పథకాల అమలులో వేగం పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా సంక్షేమ, పశుసంవర్ధక, గిరిజన అభివృద్ధి, రవాణా, నగరాభివృద్ధి వంటి విభాగాలు ప్రజల దైనందిన జీవన ప్రమాణాలను ప్రభావితం చేసే రంగాలు కావడంతో.. ఈ నియామకాలు కీలకమవుతున్నాయి

Latest