Mahaa Daily Exclusive

  రాష్ట్ర చరిత్రలో  నిలిచేలా ప్రజా విజయోత్సవాలు:డిప్యూటీ సీఎం భట్టి

Share

  • రాష్ట్ర చరిత్రలో  నిలిచేలా ప్రజా విజయోత్సవాలు
  • పండుగ వాతావరణం కనిపించేలా జరగాలి
  • పెట్టుబడిదారులను ఈ విజయోత్సవానికి ఆహ్వానిస్తున్నాం
  • పెద్ద ఎత్తున ఎంఓయూలు జరిగేలా వాతావరణం ఉండాలి
  • ప్రజా విజయోత్సవాల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, మహా: తెలంగాణ రైజింగ్ తో పాటు తెలంగాణ ఆవిర్భావం, అభివృద్ధి అంశాలు కలగలిపి ఒక సమగ్ర ప్రణాళికతో ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రజా పాలన విజయోత్సవాల నిర్వహణపై ప్రభుత్వ సలహాదారు కే కేశవరావుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావం ఎలా సాధించాం, కొత్త రాష్ట్రంలో ఎన్ని విజయాలు నమోదు చేశాం, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఏం సాధించబోతుంది అనే విషయాలను ప్రపంచానికి వివరించే విధంగా కార్యక్రమాలు ఉండాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు.

పెట్టుబడిదారులను ఈ విజయోత్సవానికి ఆహ్వానిస్తున్నాం, పెద్ద ఎత్తున ఎంఓయూలు జరిగేలా వాతావరణం ఉండాలి అన్నారు. దుబాయ్ ఫెస్టివల్ పూర్తిగా దుబాయ్ పట్టణానికి దూరంగా జరుగుతుంది అదే పద్ధతిలో మన రాష్ట్రంలోనూ ఫ్యూచర్ సిటీలో కొన్ని ప్రదర్శనలు ఏర్పాటు చేసేందుకు అధికారులు ఆలోచన చేయాలని డిప్యూటీ సీఎం అన్నారు. సీనియర్, జూనియర్ అధికారులతో కలిపి కమిటీలు వేయాలని ప్రణాళిక ప్రకారం పనులు విభజించుకుని నాణ్యతతో సకాలంలో అనుకున్న ప్రణాళికను అమలు చేసేలా ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం, మూసి పునర్జీవనం, ఫ్యూచర్ సిటీ, ఇప్పటికే అనేక పరిశ్రమలను తెలంగాణ ఆకర్షిస్తుంది, భవిష్యత్తు తెలంగాణ ఎలా ఉండబోతుందో ఈ వేడుకల్లో ప్రపంచానికి చూపించే విధంగా ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ రావు, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా , వివిధ విభాగాల కార్యదర్శులు, సమాచార పౌర సంబంధాల కమిషనర్ ప్రియాంక, సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు

Latest