- కిషన్ రెడ్డికి క్రికెట్ గురించి ఏం తెలుసు?
- దేశగొప్పతనాన్ని ప్రపంచానికి చాటితే దేశద్రోహినా?
హైదరాబాద్, మహా : కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని రాష్ట్ర మంత్రి అజారుద్దీన్ హెచ్చరించారు. శనివారం మీడియాతో మాట్లాడిన అజారుద్దీన్.. తనపై వచ్చిన ఆరోపణలపై కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన తాను దేశ ద్రోహినా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే బీజేపీ తనను టార్గెట్ చేసిందని దుయ్యబట్టారు. కిషన్ రెడ్డికి క్రికెట్ గురించి ఏం తెలుసు? కిషన్ రెడ్డికి కనీసం క్రికెట్ బ్యాట్ అయినా పట్టుకోవడం వచ్చా అని విమర్శించారు. మాట్లాడటానికి ఏమి లేక మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు. ఆర్నెళ్లలోపు అజారుద్దీన్ ఎమ్మెల్సీ కాలేరని ఆయన మంత్రి పదవి కేవలం ఆరు నెలల పాటే అంటూ వస్తున్న విమర్శలపై స్పందిస్తూ అన్నింటికి కాలమే సమాధానం చెబుతుందన్నారు
Post Views: 29






