Mahaa Daily Exclusive

  దయచేసి నిబంధనలు మార్చండి….

Share

  • దయచేసి నిబంధనలు మార్చండి..
  • సీపీఐ కొత్త రూల్స్‌తో రైతులకు తీవ్ర నష్టం
  • కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌, సీసీఐ సీఎండీకి మంత్రి తుమ్మల లేఖ

హైదరాబాద్, మహా: కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌, సీసీఐ సీఎండీ లలిత్‌కుమార్‌ గుప్తాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. పత్తి కొనుగోళ్లలో సీసీఐ విధించిన నిబంధనలు మార్చాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి కోరారు. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలన్న సీసీఐ కొత్త నిబంధన నేపథ్యంలో ఆయన లేఖ రాశారు. సాధారణంగా ఇప్పటి వరకు ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తుండగా.. ఎకరాకు 11.74 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడులు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ల నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం డిక్లరేషన్ ఇచ్చిందని ఆ లేఖలో ప్రస్తావించారు. ‘ఈ ఏడాది అధిక వర్షాల వల్ల పత్తి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో సీసీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధన పత్తి రైతులకు నష్టం చేసేలా ఉంది. తేమ శాతం విషయంలో 20శాతం వరకు ఉన్నా సరే పత్తి పంట సీసీఐ కొనుగోలు చేయాలి. కపాస్ కిసాన్ యాప్‌పై అవగాహన లేకపోవడం వల్ల కూడా పత్తి రైతులకు ఇబ్బందులు తలెత్తాయి. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని 7 క్వింటాళ్ల నిబంధన ఎత్తి వేసి పాత పద్ధతిలో పత్తి కొనుగోళ్లు చేయాలి. జిన్నింగ్ మిల్లర్ల సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలి’’అని మంత్రి తుమ్మల కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు

Latest