హైదరాబాద్, మహా
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఏపీలో విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడా కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. ఇక తెలంగాణలో యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, వనపర్తి, నారాయణపేట, గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాల్లో పిడుగుతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు.
Post Views: 20







