- చేవెళ్ళ రోడ్డు ప్రమాదంపై హెచ్ఆర్ సీ సీరియస్
- సుమోటోగా కేసు నమోదు… నోటీసులు జారీ
హైదరాబాద్, మహా : చేవెళ్ళ రోడ్డు ప్రమాదంపై మానవ హక్కుల కమిషన్ సీరియస్ గా స్పందించింది. సూమోటోగా కేసు నమోదుచేసింది. సోమవారం తెల్లవారుజామున చేవెళ్ళ రోడ్డులోని మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సును కంకర టిప్పర్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 19 మంది కంకరలో కూరుకుపోయి ఊపిరి ఆడకుండా చనిపోయారు. ప్రమాదంపై మీడియా ఛానళ్ళు, దినపత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా కమిషన్ కేసు నమోదు చేసింది. రవాణా, రోడ్లు, భవనాల శాఖ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు కమిషన్ నోటీసులు జారీచేసింది. డిసెంబర్ 15వ తేదీలోగా ప్రమాదంపై సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఎండీ, నేషనల్ హైవేస్ అథారిటి ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసును కూడా నివేదికను సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. ఇప్పటికే బస్సు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డీజీపీ శివధర్ రెడ్డి తదితరులు ఘటనా స్ధలానికి వెళ్ళి పరిశీలించారు







