Mahaa Daily Exclusive

  పంటలకు రక్ష భూసార పరీక్ష…

Share

  • పంటలకు రక్ష భూసార పరీక్ష
  • ఎరువులపై కూడా ఖర్చు తగ్గుతుంది
  • ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని సూచన

హైదరాబాద్, మహా: ప్రతి రైతు భూసార పరీక్ష చేయించుకోవడం వల్ల వారి భూములలో ఎంత శాతం పోషకాలు ఉన్నాయో తెలుస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తద్వారా పంటల సాగుకు అనుకూలంగా ఇంకా ఎంత మోతాదులో ఎరువులు వాడాలో తెలుస్తుందని, కాబట్టి భూసార పరీక్ష పత్రం ఆధారంగా ఎరువుల వాడకం వల్ల రైతులకు ఎరువులపై ఖర్చు తగ్గడమే కాకుండా, భూమి ఆరోగ్యం కూడా కాపాడినట్లు అవుతుందని తెలియజేసారు. వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి మంగళవారం జరిగే ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జరిగిన 74వ ఎపిసోడ్‌లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని, రైతులకు భూసార పరీక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నాం..
ఈ సందర్భంగా మంత్రి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. నీటి వసతి కలిగిన ప్రతి రైతు వరి, పత్తి పంటల బదులు ఆయిల్ పామ్ పంట సాగు చేపట్టాలని, దాని ద్వారా ఎక్కువ ఆదాయం పొందవచ్చని, ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం మొక్కలు, డ్రిప్, అంతర పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తుందని, ఆయిల్ పామ్‌లో అంతర పంటలుగా కోకో, మిరియాలు, వక్క సాగు చేయడం వల్ల ఒకే భూమిలో ఎక్కువ రకాలైన పంటలు సాగుచేసి, అధిక ఆదాయం పొందవచ్చునని మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ డా. బి. గోపి, ఉద్యాన శాఖ డైరక్టర్ యాస్మిన్ బాషా, మార్కెటింగ్ శాఖ డైరక్టర్ లక్ష్మి బాయి, వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు, రైతులు పాల్గొన్నారు

Latest