- రూ. 3వేల కోట్ల బకాయిలు చెల్లించండి
- డిసెంబర్ నెలలో మద్యం సరఫరా చేయలేం
- ప్రభుత్వానికి మద్యం కంపెనీలు ప్రభుత్వానికి అల్టిమేటం
హైదరాబాద్, మహా: నవంబర్ 10వ తేది లోపు రూ. 3వేల కోట్ల బకాయిలు క్లీయర్ చేయాలని, డిసెంబర్ నెలలో మద్యం సరఫరా చేయలేమని మద్యం కంపెనీలు ప్రభుత్వానికి అల్టిమేటం వేశాయి. ఈ మేరకు మంగళవారం రాష్ట్రంలో మద్యం కోరత ఏర్పడనుందని లేఖ రాశాయి. ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎస్డబ్ల్యూఏఐ), బ్రేవర్స్ అసోసియేషన్ ఆప్ ఇండియా( బీఏఐ), కాన్ఫిడేరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహలిక్ బేవరేజ్ కంపెనీస్(సీఐఏబీసీ)లు లేఖలో పేర్కోన్నాయి. రాష్ట్రం నుంచి రావల్సిన బకాయిలు రూ.3366కోట్లు ఉన్నట్లు తెలిపాయి. నవంబర్ 2వ తేదిన పంపిన లేఖలో పేర్కోంది. ఆల్కోబెవ్ కంపెనీలకు దీపావళి నిరాశాజనకంగా ఉందని, పండుగ సీజన్ విషాదకరంగా ఉందని పేర్కోన్నాయి. చెల్లింపు సంక్షోభం తీవ్రమవుతున్నందున తెలంగాణలో పండుగ సీజన్లో మద్య పానీయాల కొరతను ఆశించండి అని పరిశ్రమ సంఘాలు చెబుతున్నాయని పేర్కోన్నాయి. జూన్ నుంచి అక్టోబర్ వరకు ప్రభుత్వం చెల్లించిన బకాయిలు వివరాలు వెల్లడించాయి






