Mahaa Daily Exclusive

  బీదర్ లో రోడ్డు ప్రమాదం

Share

  • బీదర్ లో రోడ్డు ప్రమాదం
  • నలుగురు తెలంగాణ వ్యక్తుల మృతి
  • మృతులందరూ నారాయణఖేడ్ మండలానికి చెందిన వారు

జహీరాబాద్, మహా : బుధవారం తెల్లవారు కర్నాటకలోని బీదర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు మరణించారు. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ మండలం జగన్నాధ్ పూర్ గ్రామానికి చెందిన ఐదుగురు బీదర్ దగ్గర ఉన్న గాన్గాపూర్ దత్తాత్రేయ దర్శనానికి వెళ్లారు. బుధవారం తెల్లవారుజాము ఆలయంలో దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాదుకు బయలుదేరారు. కర్నాటకలోని హల్లిఖేడ్ దగ్గర వీరి కారును ఎదురుగా వస్తున్న కొరియర్ సర్వీసు వ్యాన్ బలంగా ఢీకొన్నది. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. అంబులెన్సులను తెప్పించారు. అయితే ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో నవీన్(40), కాశీనాధ్(60), రాచప్ప(45), నాగరాజు(40) ప్రమాదస్ధలంలోనే మరణించారు. ఐదో వ్యక్తి ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నాడు

Latest