- కాంగ్రెస్ అంటేనే కరెంట్… కరెంట్ అంటేనే కాంగ్రెస్
- కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్న వారు ముట్టుకుంటే తెలుస్తుంది
- పరిగి నియోజకవర్గం లో వెయ్యి కోట్లతో విద్యుత్ అభివృద్ధి పనులు
- పరిగిలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
పరిగి, మహా : కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంటు అంటేనే కాంగ్రెస్ అని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదన్న వారు కరెంటుతో పాటు కాంగ్రెస్ ను ముట్టుకుంటే తెలుస్తుందని ష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. బుధవారం పరిగి నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న భట్టి అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రాష్ట్రంలో 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ను 53 లక్షల కుటుంబాలకు అందజేస్తున్నామన్నారు. వికారాబాద్ జిల్లాలో 2 లక్షల 47 వేల 777 కుటుంబాలంటే నిరుపేదలైన 1 లక్ష 43 వేల 190 కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు . ఒక్క పరికి నియోజకవర్గంలోనే 44,500 కుటుంబాలకు గృహ జ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ ను అందిస్తున్నామన్నారు. ప్రతి నెల గృహ జ్యోతి పథకం కోసం ప్రభుత్వం 2830 కోట్ల రూపాయలను విద్యుత్ శాఖకు చెల్లిస్తుందన్నారు. పరిగి నియోజకవర్గంలో వెయ్యి కోట్లతో విద్యుత్ అభివృద్ధి పనులను మంజూరు చేశామన్నారు. నియోజకవర్గానికి 9 సబ్ స్టేషన్ లతోపాటు 33/11 కెవి, 400 కేవీ సబ్ స్టేషన్ తో పాటు 220 కెవి సబ్ స్టేషన్ ను మంజూరు చేశామన్నారు పరిగి నియోజకవర్గ అభివృద్ధి కోసం రామ్మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. నా వెల్ ప్రాజెక్టుకు సంబంధించిన మూడు వేల కోట్ల సాధన కోసం ఆయన ఎంతగానో కృషి చేశారని, అయితే గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు పట్టించుకోలేదన్నారు. డిఫెన్స్ కు సంబంధించి 3000 కోట్లు రావడం ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్తులో పరిగి నియోజకవర్గంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి కోసం విద్యుత్తు సబ్ స్టేషన్ లు పెద్ద ఎత్తున మంజూరు చేశామని వాటికి భూమి పూజ కూడా చేశామన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆయా కుటుంబాలు అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే మన్నెగూడ నుంచి బీజాపూర్ వరకు రోడ్డు మంజూరు అయిందని, అయితే గతం పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్జీటీ 2 లో ఉన్న కేసును గత నెల 30న తొలగించడం కోసం కృషి చేయడం వల్ల నాలుగు లైన్ల రహదారి పనులు వడివడిగా నడుస్తున్నాయన్నారు. గత ప్రభుత్వ మూడెకరాల భూమి ఇంటికో ఉద్యోగం, బంగారు తెలంగాణ చేస్తామని చెప్పిందని అందులో ఒక్కటైనా అమలైందా అని ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్టు కడతామని చెప్పి మోసం చేసిందని, కృష్ణ నదిపై ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని, గోదావరిపై లక్ష కోట్ల రూపాయలతో కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు సంగతి ఏమైందో ప్రజలందరికి తెలుసు అన్నారు . యూపీఏ ప్రభుత్వ హయాంలో వంద రోజులు ఉపాధి పనులను మాత్రమే గత ప్రభుత్వం గ్రామాలలో చేపట్టినప్పుడు అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు కొబ్బరికాయలు కొట్టి ఫోటోలు దిగారని, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు చేసే పనిని వాళ్ళు చేశారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో నాలుగు లక్షల 50వేల ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం
గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఏ ఒక్క నిరుపేదకు ఇల్లు కట్టించి ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేసి ప్రతి ఇంటికి 5 లక్షల చొప్పున కేటాయించామని, రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఇండ్లను నిర్మిస్తున్నామన్నారు. 93 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 93 లక్షల కుటుంబాలకు రూ. 10 లక్షలతో ఈ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేస్తున్నామన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న అప్పటి ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదని, రాష్ట్రం కోసం పోరాడిన నిరుద్యోగులకు వయసు మీరిపోతున్న వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం 60 వేల ఉద్యోగాలను కల్పించిందని, కొందరు గ్రూప్ 1 అడ్డుకోవాలని చూస్తే, కోర్టుకు వెళ్లి వారికి నియామక పత్రాలను అందజేశామన్నారు. తెలంగాణలో కేవలం సంక్షేమం కోసమే 1 ఒక లక్ష 600 వేల 310 కోట్ల ను ఖర్చు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మంజూరు చేశామని ఒక్కొక్క స్కూలు 25 ఎకరాలలో 200 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు.
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వారానికి మూడు రోజులు ప్రజాబాట నిర్వహించబోతుందన్నారు. తెలిపారు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులే ప్రజల వద్దకు వెళ్తారని అంబులెన్స్ లాగా ఒక వాహనం కూడా ఉంటుందన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచబోతున్నామన్నారు








