Mahaa Daily Exclusive

  మీర్జాగూడ బస్సు ప్రమాదం…. బాధితులకు మహేందర్ రెడ్డి ఆపన్న హస్తం…..

Share

  • మీర్జాగూడ బస్సు ప్రమాదం
  • బాధితులకు మహేందర్ రెడ్డి ఆపన్న హస్తం
  • ఒక్కొక్కరికి రూ.20వేల స్వంతంగా ఆర్థిక సహాయం
  • ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం : మహేందర్ రెడ్డి
  •  రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని పిలుపు

చేవెళ్ల, మహా: చేవెళ్ల మండలం మీర్జాగూడ రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అప్పన్న హస్తం అందించారు. మీర్జాగూడ వద్ద మితిమీరిన వేగంతో తాండూరు ఆర్టీసి బస్సును కంకర ట్రిప్పర్ ఢీ కొన్న ఘటనలో 19 మంది మృతిచెందగా,మరో 21 మంది గాయాల పాలైన నేపథ్యంలో మహేందర్ రెడ్డి గురువారం తాండూరు లో పర్యటించి 13 మంది మృతుల బాధిత కుటుంబాలను పరామర్శించారు.ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీలోని సాహెల్,ఖాలీద్ లతో పాటు 02నెలల పాప కుటుంబానికి, వాల్మీకి కాలనీలో వెంకటమ్మ, విశ్వంభర (బృందావనం)కాలనీలో తబస్సుమ్, గౌతాపూర్ లోని ముస్కాన్ బేగం , పాత తాండూర్ లోని దస్తగిరి ఇళ్ళకు వెళ్ళి ప్రభుత్వం అందించిన రూ. 7 లక్షలకు అదనంగా
తన స్వంత డబ్బులు ఒక్కొక్కరికి
రూ. 20 వేల ఆర్థిక సహాయం చేశారు.

అలాగే యాలాల మండలం పేర్కంపల్లి ఎల్లయ్య గౌడ్ కుటుంబం మరింత విషాదం నింపిన ముగ్గురు కుమార్తెల విషయంలో మహేందర్ రెడ్డి తీవ్ర మనస్తాపం కు గురైయ్యారు. ఎల్లయ్య గౌడ్ కుటుంబంతో పాటు లక్ష్మీనారాయణకు గ్రామానికి చెందిన అకిలా,హాజీపూర్ కు చెందిన మృతులు బందెప్ప, లక్ష్మి దంపతుల కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. బందప్ప పిల్లలు అనాధలుగా కాకుండా తమ ట్రస్ట్ ద్వారా చదువులు ఇతర అంశాలకు ఆదుకుంటామని మహేందర్ రెడ్డి బాధాతప్త హృదయంతో హామీ ఇచ్చారు.
అలాగే గాయపడిన తాండూర్ ప్రాంతానికి చెందిన ఏడుగురి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఇంకనూ ప్రభుత్వపరంగా మృతి చెందిన, గాయపడిన కుటుంబాలకు అవసరమైన ఆర్థిక సహాయం చేస్తామని మహేందర్ రెడ్డి వెల్లడించారు. బాదిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయిస్తామని తబస్సుమ్ కుటుంబికుల వద్ద వివరించారు. తన సహాయ సహకారాలు ఎల్లవేళలా తాండూరు ప్రజలకు ఉంటాయన్నారు. గాయడడిన వారందరికీ చేవెళ్ల లోని తన ఆస్పత్రిలో మంచి వైద్యం అందిస్తున్న ట్లు మహేందర్ రెడ్డి వివరించారు.

మానవ తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు: మహేందర్ రెడ్డి

రోడ్డు ప్రమాదాలు చాలా మటుకు మానవ తప్పిదాలతోనే జరుగుతున్నాయని మహేందర్ రెడ్డి తెలిపారు. మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం గతంలో ఆలూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఇలాంటి ప్రమాదాలన్నీ డ్రైవర్ల నిర్లక్ష్యం, మితిమీరిన వేగం, విశ్రాంతి లేకుండా విధులను నిర్వహించడం, లారీల ఓవర్ లోడింగ్ తదితరులతో చోటు చేసుకుంటున్నాయని మహేందర్ రెడ్డి చెప్పారు. పోలీస్ అకాడమీ మన్నెగూడ రోడ్డు గ్రీన్ ట్రిబ్యునల్ లో ఇచ్చి వలె సమస్య పరిష్కారమై పనులు ప్రారంభమైన నేపథ్యంలోనే ప్రమాదం చోటు చేస్తుందని ఇది అత్యంత బాధాకరమని మహేందర్ రెడ్డి వాపోయారు. తాను మంత్రిగా ఉన్నప్పుడే ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించమని అన్నారు. వికారాబాద్ – తాండూర్ రోడ్డుకు సైతం తాను మంత్రిగా ఉన్నప్పుడే నిధులు ఇచ్చి, పనులు జరిగాయని తన ఓటమి తర్వాత ఆ రోడ్డు పనులను పూర్తి చేసుకోలేక, అభివృద్ధి చేసుకోలేక పోయిందని పేర్కొన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కి వివరిస్తే చొరవతో ఈ పనులు ప్రారంభమయ్యాయి అని అన్నారు. వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో రోడ్ల విస్తరణతో పాటు రోడ్డు భద్రత నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని మహేందర్ రెడ్డి సూచించారు. ఇందుకు త్వరలో రోడ్డు భద్రత పై ప్రతి వ్యక్తికి అవగాహన కలిగేటట్లుగా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని అవగాహన కార్యక్రమాలు ప్రారంభమైతాయని మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

టిపిసిసి ప్రచార కమిటీ సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు, సీనియర్ నేత సిత్రాలు శ్రీనివాస్,గడ్డలి రవిందర్,బిర్కిట్ రఘు,పరిమళ, అబ్దుల్ కవి,భగవాన్, అగ్గనూర్ సంకేత్, సిద్దు అయ్యా, ఆదమ్ ఖాన్ తదితరులు ఆయనతో ఉన్నారు