- గోపీనాథ్ చావుకు కేటీఆరే కారణం!
- నా కొడుకు మృతి ఆయన సమాధానం చెప్పాలి
- దివంగత నేత గోపీనాథ్ తల్లి సంచలన ఆరోపణ
హైదరాబాద్, మహా: జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే దివంగత నేత మాగంటి గోపినాథ్ తల్లి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెనుదుమారంగా మారాయి. గురువారం మాగంటి గోపినాథ్ తల్లి మాట్లాడుతూ.. అసలు తన కొడుకు ఎలా , ఎందుకు చనిపోయాడో కూడా తమకు తెలీదన్నారు. తన కొడుకు ఆస్పత్రిలో మూడు రోజులు ఐసీయూలో ఉన్నాడని ఇతరులు చెప్తే తెలిసిందన్నారు. అంతేకాకుండా.. ఆస్పత్రికి వెళ్తే కన్న తల్లి అయిన తనను కొడుకు వద్దకు వెళ్లనీయకుండా సిబ్బంది అడ్డుకున్నారన్నారు. ఎన్నిమార్లు ప్రాధేయపడిన కూడా వెళ్లనీయలేదన్నారు. ఒకసారి కేటీఆర్ కన్పిస్తే ఆయన దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి తన కొడుకును చూడనియ్యటంలేదని చెప్తే కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కేటీఆర్ వచ్చి వెళ్లాక ఆయన చనిపోయాడని ప్రకటించడం వెనుక ఏంజరిగిందో కేటీఆర్ మాత్రమే చెప్పాలని మాగంటి గోపినాథ్ తల్లి డిమాండ్ చేశారు.
నా కొడుకు చనిపోయేటప్పుడు అతనికి 63 తనకు 92 ఏళ్లని.. మూడు రోజులుగా తన కొడుకు చూపు కోసం పరితపించిన కూడా తనను లోనికి రానివ్వలేదని మాగంటి గోపినాథ్ తల్లి షాకింగ్ విషయాల్ని వెల్లడించింది. కేటీఆర్ నాకు సమాధానం చెప్పాలీ, 90 ఏళ్ల వయసులో నా కడుపు కోతకు కరణం కేటీఆరేనని ఆరోపించారు. కేటీఆర్ హాస్పిటల్ కి వచ్చినప్పుడు అడిగినా ” ఒక్క సారి గోపీని చూపించండి అని ” పెద్ద దాన్ని అని చూడకుండా మొహం మీద డోర్ వేసి వెళ్ళిపోయాడన్నారు. అయితే సునీత తరపు లాయర్ మాత్రం.. మాగంటి గోపీనాథ్ భార్య సునీతేనని అన్ని రికార్డుల్లోఉందని స్పష్టం చేశారు. పిల్లల పేర్లు కూడా లీగల్ గా రికార్డుల్లో ఉన్నాయన్నారు. తహశీల్దార్ నవంబర్ 25న తదుపరి విచారణ నిర్వహిస్తారు. ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇష్యూ పెండింగ్‌లో ఉంటుంది







