Mahaa Daily Exclusive

  బండి సంజయ్‌పై చర్యలు తీసుకోండి… ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ…

Share

హైదరాబాద్, మహా: కేంద్రమంత్రి బండి సంజయ్‌పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆయనపై చర్యలు తీసుకోవాలని పీసీసీ ఎన్నికల కో ఆర్డినేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో సీఈవోకు ఫిర్యాదు చేసింది. గురువారం బోరబండలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ‘‘తులం బంగారం ఇచ్చుడు కాదు.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ గెలిస్తే ఉన్న బంగారం గుంజుకెళ్తారు. సీఎం రేవంత్‌రెడ్డి.. ఒక్క కేసులో కూడా కేసీఆర్‌ కుటుంబాన్ని జైల్లో పెట్టలేదు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి దోచుకున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ’’ అని సంజయ్‌ ఆరోపించారు