Mahaa Daily Exclusive

  తమాషా చేస్తే తాటతీస్తా…….

Share

  • తమాషా చేస్తే తాటతీస్తా
  • ప్రైవేట్ విద్యా యాజమాన్యాలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
  • దఫల వారిగా ఫీజు రిఎంబర్ మెంట్ బకాయిలను చెల్లిస్తాం

హైదరాబాద్, మహా : ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్తాయిలో విరుచుకుపడ్డారు. తమాషా చేస్తే తాటతీస్తానని హెచ్చరించారు. విద్య అనేది సేవ.. వ్యాపారం కాదని స్పష్టం చేశారు. ప్రైవేట్‌ విద్యాసంస్థలు సేవ చేయడం లేదు, వ్యాపారం చేస్తున్నాయని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం) మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి
విద్యార్థులకు నష్టం కలిగిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఫీజురీయంబర్స్‌మెంట్‌పై ప్రైవేటు విద్యాసంస్థలు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కాలేజీలను బంద్‌ చేయించిన వారితో చర్చలు ఎలా ఉంటాయన్నారు. యాజమాన్యాల వెనుక ఎవరున్నారో తెలుసని, ఏ పార్టీకి యాజమాన్యాలు కొమ్ముకాస్తున్నాయో కూడా తెలుసన్నారు. ఫీజు రిఎంబర్స్ మెంట్ బకాయిలను దఫల వారిగా చెల్లిస్తామని స్పష్టం చేశారు. చూస్తాం, ఎలా విద్యాసంస్థలను నడుపుతారో అని కూడా అన్నారు. పీజుల పేరుతో యాజమాన్యాలు చేస్తున్న తతంగమంతా ప్రభుత్వానికి తెలుసన్నారు. విద్య పేరుతో వ్యాపారం చేస్తున్న యాజమాన్యాలు ప్రభుత్వాన్నే బెదరిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కళాశాలల యాజమాన్యాల వెనుక ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారన్నది కూడా తెలుసన్నారు. అడిగిన వెంటనే ఇవ్వలేదని కళాశాలలను మూసి వేస్తామంటే ఎట్టి పరిస్థితులలో సహంచేది లేదని తేల్చి చెప్పారు