Mahaa Daily Exclusive

  కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి.. పంట సేకరణకు ఈ నెల కీలకం…

Share

  • కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నాం
  • కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి.. పంట సేకరణకు ఈ నెల కీలకం
  • మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • ధాన్యం కొనుగోళ్లలో సమస్యలపై జిల్లా కలెక్టర్లతో మంత్రుల సమీక్ష

హైదరాబాద్, మహా: ధాన్యం కొనుగోళ్లలో సమస్యలపై జిల్లా కలెక్టర్లతో నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ రామక్రిష్ణారావు సమీక్ష చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో జరిగిన ఈ సమీక్షలో పత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మొక్కజొన్న కొనుగోలులో ఎకరాకు 18.5 క్వింటాళ్ల నుంచి 25 క్వింటాళ్ల వరకు పరిమితి పెంచడం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారని జిల్లా కలెక్టర్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తెలిపారు. పత్తి కొనుగోలులో ఎల్1 ఎల్2 నిబంధనల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలనే సీసీఐ నిబంధన ఎత్తివేసి, 12 క్వింటాళ్ళు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తుందని మంత్రి తెలిపారు. వర్షాల వల్ల రంగుమారిన సోయా చిక్కుడు కొనుగోలు చేయాలని కేంద్రానికి ప్రతిపాదన పంపినట్లు జిల్లా కలెక్టర్లకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పంటల సేకరణకు ఈ నవంబర్ నెల కీలకమని జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.

Latest