Mahaa Daily Exclusive

  ఢిల్లీలో ఉగ్రదాడి….భారీ పేలుళ్లతో దద్దరిల్లిన దేశ రాజధాని…

Share

  • ఢిల్లీలో ఉగ్రదాడి
  • భారీ పేలుళ్లతో దద్దరిల్లిన దేశ రాజధాని
  • 13 మంది దుర్మరణం.. మరో 30మందికి గాయాలు
  • దేశవ్యాప్తంగా హై అలర్ట్.. హైదరాబాద్ సహా ప్రధాన నగరాలను అలర్ట్ చేసిన కేంద్రం
  • సంఘటనపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి.. హోంమంత్రి అమిత్ షాకు ఫోన్
  • ఢిల్లీ రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ 4 దగ్గర భారీ పేలుళ్లు.. కదిలే కారులో వచ్చి ఘోరం

హైదరాబాద్, మహా

దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర సోమవారం సాయంత్రం పేలుడు దద్దరిల్లింది. ఈ బాంబు పేలుడులో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందగా, 24 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారందరిని ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎర్రకోట సమీపంలో నిలిపి ఉంచిన ఓ స్విఫ్ట్​ కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, ఈ పేలుడు ధాటికి 24 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దీనితో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ 4 దగ్గర భారీ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో అనేక వాహనాలకు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. భారీశబ్ధాలతో అక్కడివారు వణికిపోయారు. పేలుడు శబ్ధం కొన్ని కిలోమీటర్ల దూరంలోని ఐటీవో వరకు వినబడింది. సిగ్నల్ వైపు నెమ్మదిగా కదులుతున్న ఒక వాహనంలో పేలుడు జరిగందని ప్రత్యక్షసాక్షలు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులతో పాటు అగ్నిమాపక దళాలు అక్కడకు చేరుకున్నాయి. 25కు పైగా అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పేశాయి. ఈ ఘటనతో ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్​షాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు అమిత్​ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్​తో మాట్లాడారు. ఐబీ డైరెక్టర్​తో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నారు. వెంటనే ఘటనాస్థలికి. ఆస్పత్రికి వెళ్ళి పరిస్థితిని పర్యవేక్షించారు. ఆసుపత్రికి 15 మంది క్షతగాత్రులను తీసుకువచ్చారు. వారిలో 8 మంది మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఒక వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.” అని ఎల్​ఎన్​జేపీ ఆసుపత్రి సూపరింటెండెంట్​ చెప్పారు. అయితే ఘటనాస్థలంలో పరిస్థితిని చూస్తే ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి లాగానే కనిపిస్తోంది. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో పరిస్థితి గందరగోళంగా మారింది. ఢిల్లీ పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. ఎర్రకోట సహా కీలక ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించారు. భారీ ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్ టీమ్, ఎన్​ఐఏ, ఎన్​ఎస్​జీ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో విధులు ముగించుకొని జనాలు ఇళ్లకు చేరే క్రమంలో భారీ పేలుళ్లు జరగ్గా, చాందినీ చౌక్, ఎర్రకోట పరిసరాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.

డెలివరి బాయ్ సజీవదహనం
ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలం దగ్గర భారీ పేలుడు కారణంగా మంటలు అంటుకొని ఒక డెలివరి బాయ్ సజీవదహనం అయ్యారు. పేలిన కారులో హైగ్రేడ్ ఎక్స్‌ప్లోజివ్ ఉపయోగించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్రహోంమంత్రి అమిత్‌షా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేలుడుపై దర్యాప్తునకు ఆదేశించారు. అలాగే ఆయన ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు, ఐబీ చీఫ్‌తో మాట్లాడినట్లు తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడి తనతో మాట్లాడినట్లు అమిత్‌షా వెల్లడించారు.

ఢిల్లీ పేలుళ్ళతో..
ఢిల్లీ పేలుళ్లతో ఉత్తర ప్రదేశ్, వాణిజ్య రాజధాని ముంబై మహానగరం అలర్ట్ అయ్యాయి. అయోధ్య రాం మందిర్ దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. గత కొంతకాలంగా దేశంలోని జమ్మూ కాశ్మీర్, హర్యానా, గుజరాత్ లతో పాటు ఢిల్లీలో పాగా వేసిన ఉగ్రవాద మూకలు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.

హైదరాబాద్​లో హైఅలర్ట్

ఢిల్లీ పేలుడు ఘటనతో కేంద్రం హైదరాబాద్​తో సహా పలు నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. దీనితో హైదరాబాద్​ పోలీసులు అప్రమత్తమై పాతబస్తీలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్​లోని అన్ని మతపరమైన ప్రదేశాలు, సరిహద్దు ప్రాంతాల్లోనూ భద్రత పెంచాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆ రాష్ట్ర డీజీపీ తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో గస్తీ, తనిఖీలు పెంచాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
…………..
ఢిల్లీ పేలుడుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. “సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా కొంతమంది పాదచారులు గాయపడ్డారని, కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం కొంతమంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పేలుడు సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌జీ , ఎన్‌ఐఏ బృందాలు.. ఫోరెన్సిక్ బృందంతో కలిసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించాయి. సమీపంలోని అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.’’ అని అన్నారు.

Latest