Mahaa Daily Exclusive

  అక్కినేని అమలతో.. ఎఎన్ఎన్-మహా ప్రతినిధి..నర్సయ్యతాత సరదా సంభాషణ…

Share

(హైదరాబాద్ -మహా)

ఎఎన్ఎన్ తెలుగు – మహా పత్రిక ప్రతినిధి నర్సయ్య తాతతో అక్కినేని అమల సరదాగా సంభాషించారు. హైదరాబాద్ లో ఓ ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన అమల నర్సయ్యతాతను చూసి దగ్గరకు వచ్చిన అమల గొంగడి బాగుందంటూ సరదాగా సంబాషించారు. మాటతీరు బాగుందని, కార్యక్రమం బాగుందని అభినందించారు. గతంలో నాగార్జున హోస్ట్ చేసే బిగ్ బాస్ అగ్నిపరీక్ష వరకు వెళ్ళొచ్చిన నర్సయ్యతాతను ఇపుడు అమల స్వయంగా వచ్చి పలకరించింది. తెలంగాణ పల్లె వేషధారణను, కళలను గౌరవిస్తూ కొనసాగిస్తున్న నర్సయ్యతాతను, ప్రోత్సహిస్తున్న ఎఎన్ఎన్ ఛానల్ ను అభినందించింది. ప్రతిరోజూ ఉదయం 8గంటలకు మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్యతాత, ప్రతిరోజూ రాత్రి 8.30కు తగ్గేదెలే నర్సయ్యతాతతో రప్పారప్పా కార్యక్రమాలు నర్సయ్యతాత విజయవంతంగా కొనసాగిస్తున్నారు.
………..

Latest