- బీహార్ పై మరో ఎగ్జిట్ పోల్
- యాక్సిస్ మై ఇండియా అంచనా ఎన్డీఏనే
- రెండుపార్టీల మధ్య తేడా స్వల్పమే
మహా
బీహార్ రాష్ట్ర చరిత్రలో తొలిసారి 68.99 శాతంతో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. ఈ రికార్డు స్థాయి పోలింగ్ ఏ పార్టీకి లాభం..? అనే చర్చ జరుగుతోంది . అధికార కూటమికే జనం మళ్లీ పట్టం కట్టారని పలు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఎన్డీయే మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లను దాటే ఛాన్స్ ఉందని అంచనా వేశాయి. ప్రతిపక్ష మహాగట్ బంధన్‌కు మరోసారి నిరాశే మిగిలే అవకాశం ఉందని పోల్స్ చెబుతున్నాయి.100 సీట్లకు అటూ ఇటూగానే రావచ్చని అంచనా వేస్తున్నాయి. అయితే వీటన్నింటికి భిన్నంగా యాక్సిస్ మైఇండియా ఎగ్జిట్ పోల్ ఉంది. బీహార్ ఎన్నికల్లో ప్రతిపక్ష మహాగట్ బంధన్‌కు100కు పైగా సీట్లు లభిస్తాయని చెబుతోంది. ఎన్డీఏ, ఎంజీబీ మధ్య కేవలం మూడు శాతం మాత్రమే ఓట్ల తేడా ఉండే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. అంతేకాదు బీహార్ తర్వాతి ముఖ్యమంత్రిగా నితిష్‌కుమార్ కంటే తేజస్వీ యాదవ్ నే ఎక్కవమంది కోరుకుంటున్నట్లు బాంబ్ పేల్చింది.అలాగే ఎన్నికల్లో పురుషులు ఎన్డీఏ వైపు మొగ్గు చూపితే, స్త్రీలు ఎంజీబీ వైపు మొగ్గు చూపారని తెలిపింది.
జూబ్లీహిల్స్ పై జన్ లోక్ పోల్, కేకే ఎగ్జిట్ పోల్ సర్వేలు
జూబ్లీహిల్స్ పై సర్వేల పరంపర కొనసాగుతోంది. ఒక్కో ఎగ్జిట్ పోల్ ఒక్కో పార్టీకి అనుకూలంగా ఉంది. కేకే సర్వేలో బీఆర్ఎస్ కు 49 శాతం, కాంగ్రెస్ కు 41శాతం ఇవ్వగా, జన్ లోక్ పోల్ సర్వే బీఆర్ఎస్ ది మూడోస్థానం అని తేల్చిచెప్పింది. జన్ లోక్ పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 44.76 శాతం, బీజేపీకి 28.65 శాతం, బీఆర్ఎస్ కు 24.65 శాతం ఓట్లు రానున్నాయని చెప్పింది. మొదటిరోజు ఎగ్జిట్ పోల్స్ లో మెజారిటీ సంస్లలు కాంగ్రెస్ వైపు మొగ్గు ఉందని చెప్పాయి. పోలింగ్ మరుసటి రోజు చెప్పిన రెండు సంస్థలు పూర్తి భిన్నంగా చెప్పాయి.
….








