Mahaa Daily Exclusive

  మంత్రి పొంగులేటికి ప్రత్యేక ఆహ్వానం

Share

ఖమ్మం, మహా: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని గురువారం కాంగ్రెస్ నేతలు కలిశారు. భారతదేశ ఐక్యతకు స్వాతంత్రానికి తారక మంత్రంగా నిలిచిన వందేమాతర గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, తొలి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదిన (నవంబర్14) సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అండ్ యూత్ కాంగ్రెస్ తెలంగాణ ఆధ్వర్యంలో సభా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఖమ్మం జిల్లాలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించనుండగా ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానం అందించడం జరిగింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించి కార్యక్రమానికి హాజరవుతానని పేర్కొన్నారు. నిర్వాహకులను మంత్రి అభినందించారు.