- మన జిల్లాకు సుదర్శన్ రెడ్డి వాస్తవిక మంత్రి
- మెడికల్ కాలేజ్, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు, కెనాల్ ఆధునీకరణలో కీలక పాత్ర
- సుదర్శన్ రెడ్డి సన్మాన సభలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్బీ
- ఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను అటకెక్కించిందని విమర్శ
నిజామాబాద్, మహా: ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం నిజామాబాద్‌లో నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సన్మాన సభలో టీపీసీసీ చీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాకు అనుభవం, ఆలోచన, అభివృద్ధిలో సుదర్శన్ రెడ్డి పెద్దన్నల వంటి నాయకుడు అని కొనియాడారు. ప్రజల సమస్యలను తన సొంత సమస్యలుగా భావించే నాయకత్వమని గుర్తు చేశారు. ఆయన ప్రభుత్వ సలహాదారు మాత్రమే కాదు – జిల్లాకు వాస్తవిక మంత్రి అని పేర్కొన్నారు. ఏ పని మొదలు పెడితే అకుంఠిత దీక్షతో పూర్తి చేసే క్రమశిక్షణ ఆయనలో ఉన్నదని చెప్పారు.
ప్రజాధనాన్ని కాళేశ్వరం పేరుతో..
వ్యాపారం, రాజకీయం రెండింటిలోనూ విజయవంతమైన ప్రయాణం కొనసాగిస్తున్నారని వెల్లడించారు. మెడికల్ కాలేజ్, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్, కెనాల్ ఆధునీకరణలో సుదర్శన్ రెడ్డిది కీలక పాత్ర ఉందని ప్రశంసించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను అటకెక్కించిందని, ప్రజాధనాన్ని కాళేశ్వరం పేరుతో గోదావరిలో పోసిన ఘనత కేసీఆర్‌దే అని విమర్శించారు. దేశంలోనే తొలిసారి తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ చరిత్రాత్మక నిర్ణయమని వివరించారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేపి కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకున్న ఉదాహరణ అని అన్నారు. 35 ఏళ్ల నిరీక్షణకు తెరదించి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్‌దని, అగ్రికల్చర్ కళాశాల త్వరలో యూనివర్సిటీలో శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే కరీంనగర్ – బాసర రోడ్డు అభివృద్ధికి రూ. 350 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. భీమ్గల్ లింబాద్రి గుట్ట ఆలయంలో టూరిజం గెస్ట్ హౌస్ కోసం రూ. 4 కోట్లు మంజూరయ్యాయని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.







