Mahaa Daily Exclusive

  రేవంత్ ధమాకా…జూబ్లీహిల్స్ లో హస్తం ప్రభంజనం……

Share

  • రేవంత్ ధమాకా
  • జూబ్లీహిల్స్ లో హస్తం ప్రభంజనం
  • అన్ని డివిజన్లలోనూ వార్ వన్ సైడ్
  • కాంగ్రెస్ దెబ్బకు.. కారు చిత్తు
  • 24,729 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ ఘనవిజయం
  • డిపాజిట్ గల్లంతైన బీజేపీ
  • రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ కు వరుస విజయాలు
  • కాంగ్రెస్ ప్రజాపాలనకు ప్రజల పట్టాభిషేకం

(హైదరాబాద్ -మహా)

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం సూపర్ సక్సెస్ అయ్యారు. సీఎం దెబ్బకు, రాజకీయ చాణక్యానికి జూబ్లీహిల్స్‌లో వార్ వన్‌సైడ్ అయ్యింది. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చెప్పినదాని కంటే ఎక్కువ ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. తన ప్రత్యర్థి.. బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొదలు.. ప్రతి దశలోనూ నవీన్ యాదవ్ లీడ్‌లో నిలుస్తూ వచ్చారు. ఏ దశలోనూ ప్రత్యర్థులు నవీన్‌ను చేరింది లేదు. ఫలితంగా 10 రౌండ్లలో 24 వేల పైచిలుకు ఓట్లతో జూబ్లీహిల్స్ గడ్డపై జయకేతనం ఎగురవేశారు. సరిగ్గా వారం రోజులు ముందు జూబ్లీహిల్స్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన సీఎం.. తనదైన శైలిలో వ్యూహ రచన చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ప్రతీ డివిజన్‌ కాంగ్రెస్‌దే..

జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 7 డివిజన్లు ఉండగా.. ప్రతీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీనే పైచేయి సాధించింది. ఒక్క షేక్ పేట్ డివిజన్‌లో మాత్రమే టఫ్ కాంపిటేషన్ కనిపించగా.. మిగిలిన అన్ని డివిజన్లలో ఏకపక్షంగా సాగిపోయింది. అన్ని డివిజన్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. మొత్తం 7 డివిజన్ల ఓట్లను 10 రౌండ్లలో కౌంట్ చేశారు. ప్రతీ రౌండ్‌లోనూ కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ లభించింది. ఫలితంగా 24,729 ఓట్ల భారీ మెజార్టీతో సునీతపై నవీన్ యాదవ్ గెలుపొందారు.
…….

మంత్రులు సక్సెస్

హైదరాబాద్, మహా
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఫలితాల్లో మంత్రుల పెర్ఫార్మెన్స్‌ అదిరిపోయింది. ప్రతీ డివిజన్ లో మంత్రులు భారీ ఆధిక్యం తెచ్చారు. ఫలితంగా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ రికార్డుమెజారిటీ సాధించింది. రహమత్‌నగర్‌లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భారీమెజారిటీ అందించారు.
వెంగళరావునగర్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరిలు మెజారిటీ అందించారు. కమ్మ వర్గం ఓట్ల మళ్లింపులో మంత్రి తుమ్మల సక్సెస్‌ అయ్యారు. షేక్‌పేట్‌లో మంత్రులు వివేక్‌, సురేఖ బీఆర్ఎస్ ను అడ్డుకుని మెజారిటీ అందించారు. ఎర్రగడ్డలో మెజారిటీని దామోదర రాజనర్సింహ అందించారు. యూసుఫ్‌గూడలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ సక్సెస్‌ అయ్యారు. బోరబండలో సీతక్క ప్రభావం చూపింది.

Latest