- ఈసీ అట్టర్ ఫ్లాప్..నైతిక విజయం నాదే
- డబ్బు, రౌడీయిజం, రిగ్గింగ్‌తో కాంగ్రెస్ గెలిచింది
- అన్ని పార్టీలు కలిస్తే కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ అది
- బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సంచలన ఆరోపణలు
హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను సక్రమంగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ అట్టర్ ప్లాప్ అయిందని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఉప ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ధ్వజమెత్తారు. కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మీడియాతో మాట్లాడారు. రౌడీల కనుసన్నుల్లో.. రౌడీయిజంతో ఈ ఎన్నికలు జరిగాయని అన్నారు. ఒక ఆడబిడ్డను ఎంత హింసపెట్టాలో అంతాపెట్టారని మాగంటి సునీత ఆరోపించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్‌లు చేయించి, రౌడీయిజంతో గెలిచింది అని అన్నారు. పోలింగ్ సెంటర్లోనూ తమపై ర్యాగింగ్ జరిగింది అని మాగంటి సునీత ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారని మాగంటి సునీత అన్నారు. కాంగ్రెస్ గెలుపు అడ్డదారి గెలుపుగా అభివర్ణించారు.
డబ్బు, రౌడీయిజం, రిగ్గింగ్…
ఎన్నికల ప్రచారంలో తమను టార్గెట్ చేస్తూ విపరీతంగా ట్రోల్స్ చేశారని ఆరోపించారు. తాము నవ్వినా…ఏడ్చినా తమదే తప్పు అన్నట్లు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా నైతికంగా విజయం మాత్రం తమదేనని మాగంటి సునీత తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చి ఓటు వేసిన వారందరికీ మాగంటి సునీత ధన్యవాదాలు తెలిపారు.అసలు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు గెలుపు కాదు అని మండిపడ్డారు. అడ్డదారిలో గెలిచారు అంటూ విమర్శించారు. అన్ని పార్టీలు కలిస్తే కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన మెజార్టీ ఇది. మేము సింగిల్‌గా పోటీ చేశాం. కౌంటింగ్ సెంటర్లో కూడా ర్యాగింగ్ చేశారు. వాళ్లు ఇచ్చిన చీరలు కట్టుకున్నట్లుగా మాట్లాడారు. డబ్బు, రౌడీయిజం, రిగ్గింగ్‌తో కాంగ్రెస్ గెలిచిందని మాగంటి సునీత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
=============================







