- అంబేద్కర్ స్మృతివనానికి మహర్దశ
- టీడీపీ అధికార ప్రతినిధి విజయ కిరణ్
- మంత్రి లోకేష్‌తో భేటీ.. స్మృతివనం శాశ్వత పరిష్కారానికి కమిటీ
ఢిల్లీ, మహా: ఏపీ మంత్రి నారా లోకేష్‌తో టీడీపీ అధికార ప్రతినిధి విజయ కిరణ్ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయవాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనం మెయింటన్స్‌కి సంబందించి వస్తున్న అభియోగాలుపై విజయ కిరణ్ మంత్రికి వినతి పత్రం అందజేశారు. దీనిపై నారా లోకేష్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అంబేద్కర్ గారి స్మృతివనంపై వస్తున్న అభియోగాలపై పూర్తి సమాచారం త్వరలో రానుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అంబేద్కర్ స్మృతివనం శాశ్వత పరిష్కారం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ కమిటీకి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సారథ్యం వహిస్తారని, వచ్చే వారం దీనిపై అంబేద్కర్ స్మృతివనాన్ని సందర్చించనున్నట్లు వెల్లడించారు. మంత్రి లోకేష్ చొరవతో శాశ్వత పరిష్కారం దిశగా అంబేద్కర్ స్మృతివనం జరగనుందని, అంబేద్కర్ స్మృతి వననికి మహర్దశ రానుందని విజయ కిరణ్ వివరించారు.








