Mahaa Daily Exclusive

  మరోసారి సీఎంగా నీతీశ్ కుమార్?

Share

  • మరోసారి సీఎంగా నీతీశ్ కుమార్?
  • 19 లేదా 20న కొత్త ప్రభుత్వం కొలువు తీరే అవకాశం
  •  నీతీశ్ కేబినెట్ లో మెజారిటీ మంత్రి పదవులు బీజేపీకే

బిహార్‌, మహా: ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి నేతలు చర్యలు చేపట్టారు. మరోసారి బిహార్‌ ముఖ్యమంత్రిగా నీతీశ్‌ కుమార్‌ కొనసాగుతారని కూటమి వర్గాలు పేర్కొన్నాయి. నవంబర్ 19 లేదా 20 తేదీల్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. ఇందుకు పట్నాలోని గాంధీ మైదానం వేదిక కానున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం గాంధీ మైదానంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

నితీష్ కేబినెట్ లో మెజార్టీ మంత్రి పదవులు బీజేపీకే..!
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ఆదివారం గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు సమర్పించనుందని.. ఆ తర్వాత కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాణస్వీకారానికి 19 లేదా 20లలో ఏ తేదీని నిర్ణయిస్తారనే విషయం ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్‌పై ఆధారపడి ఉంటుందని తెలిపాయి. సోమవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుకు ఆమోదం తెలిపే అవకాశమున్నట్లు తెలస్తోంది. ఈ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత నీతీశ్‌ తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పిస్తారు. తద్వారా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు ప్రారంభమవుతాయి. కొత్త ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పు కోసం కేంద్రమంత్రి అమిత్‌షాతో కూటమి నేతలు శనివారం సమావేశమైనట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో బీజేపీకి సింహభాగం వాటా దక్కే అవకాశం ఉన్నట్లు కూటమి వర్గాలు పేర్కొన్నాయి. తర్వాతి స్థానంలో జేడీయూ ఇతర పార్టీలు ఉన్నాయి. కేంద్ర మంత్రి చిరాగ్ పాసవాన్‌ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్)కి మూడు మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం.

Latest