Mahaa Daily Exclusive

  సీఎం రేవంత్ వ్యూహంతోనే జూబ్లీహిల్స్ గెలుపు..

Share

  • సీఎం రేవంత్ వ్యూహంతోనే జూబ్లీహిల్స్ గెలుపు
  • రెండేళ్ళ పనితీరు బేరీజు వేసి కలుపుమొక్కలను తొలగించండి
  • ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ హాట్ కామెంట్స్

హైదరాబాద్, మహా
ప్రభుత్వ పనితీరు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం తో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచామని, కాంగ్రెస్ క్యాడర్ మూడునెలలుగా ఈ గెలుపుకోసం కష్టపడిందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. ఆదివారం గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నాయకత్వం తో కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో ఆదరణ ఉన్నదని స్పష్టం అయ్యిందని, వచ్చే ఎన్నికల కోసం పార్టీని ప్రభుత్వాన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గెలుపు అద్భుతమని, ఫ్యూచర్ కోసం పనితీరును బేరీజు వేసుకుని ప్రక్షాళన చేయాలని కోరారు. బి ఆర్ ఎస్ పై ప్రజా వ్యతిరేకతతో ప్రజలంతా ఉప్పెన లాగా వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల అవుతుందని, ఇప్పుడు అందరి పని తీరును బేరీజు వేసుకుని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. బి ఆర్ ఎస్ పై వ్యతిరేకత తో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చాలా మంది కాంగ్రెస్ పార్టీ లో చేరారన్నారు. కాంగ్రెస్ పార్టీ లో వచ్చిన వారిని పని తీరును చూసి పరీక్షించి ప్రక్షాళన చేయాలన్నారు. పార్టీ లో అక్కడకదా. గంజాయి మొక్కలు కలుపు మొక్కలు ఉన్నాయని, వాటిని నిర్మూలించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
…..

Latest