హైదరాబాద్, మహా: భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ మేరకు ఆదివారం బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సాదరంగా స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి రాకతో రాజ్‌భవన్‌లో గవర్నర్ తేనీటి విందు ఏర్పాటు చేశారు. గవర్నర్ తేనీటి విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు తదితరులు హాజరయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ దీనికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. అంతకు ముందు బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్, సీఎం.. ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి హోదాలో రాధాకృష్ణన్ తెలంగాణ రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ , ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికారు.








