- సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాప్ కేసు విచారణ..
- ప్రభాకర్ రావు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా
- డిసెంబర్ 9కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ, మహా: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణ వాయిదా పడింది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు తరపు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో విచారణను జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం డిసెంబర్ 9కి వాయిదా వేసింది. కీలక ఆధారాలను ధ్వంసం చేశారని, డిజిటల్ డివైజ్‌లకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను ఇవ్వలేదని, విచారణకు సహకరించడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. గత మూడు నెలలుగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముందుకు సాగలేదు. సుప్రీంకోర్టు ఉత్వర్వుల నేపథ్యంలో ప్రభాకర్ రావుకు ఇంటీరియమ్ ప్రొటెక్షన్ ఉంటడంతో సిట్ విచారించలేదు. సిట్ అధికారులలో మార్పులు జరిగినట్లు తెలుస్తుంది.
Post Views: 31






