Mahaa Daily Exclusive

  సారె పెట్టి గౌరవించాలనే కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ:సీఎం రేవంత్ రెడ్డి

Share

  • మాది మహిళలను గౌరవించే ప్రభుత్వం
  • మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే మా సంకల్పం
  • సారె పెట్టి గౌరవించాలనే కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ:సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, మహా : రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే తమ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున సారె పెట్టి గౌరవించాలన్న ఆలోచనతో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. 2034 నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు. మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు కూడలి వద్ద ఆ మహనీయురాలి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం పలువురు మహిళా సమాఖ్య ప్రతినిధులకు చీరలను అందించి, రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నేటి నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం డిసెంబర్ 9 వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరల పంపిణీ కార్యక్రమం చేపడుతారని చెప్పారు. మార్చి 1 నుంచి 8 తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలోపు మున్సిపల్, పట్టణ, నగర ప్రాంతాల్లో పంపిణీ చేస్తామన్నారు.

ఇందిరా గాంధీ స్ఫూర్తితోనే స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లతో పాటు మహిళా సంఘాలకు జీరో వడ్డీ రుణాలు, పెట్రోల్‌బంక్‌లు అప్పగించడం, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యమే కాకుండా బస్సులకు యజమానులను కూడా ఆడబిడ్డలను చేశామన్నారు. సోలార్ పవర్ ప్లాంట్లు అందించడానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నామన్నారు. ప్రఎధాన మంత్రిగా ఇందిరా గాంధీ దేశంలో అనేక విప్లవాత్మకమైన, స్ఫూర్తిదాయకమైన నిర్ణ యాలు తీసుకున్నారని గుర్తు చేశారు. ముఖ్యంగా బడుగు, బలహీన, అట్టడుగు వర్గా ల అభ్యున్నతి కోసం చివరి రక్తపు బొట్టును ధారపోశారన్నారు. చీరల విషయంలో ఎవరూ బాధ ప డాల్సిన అవసరం లేదని, ఇది మన ఆత్మగౌరవమన్నారు. ప్రతి ఆడబిడ్డకు చీర అందుతుందన్నారు. ఆడబిడ్డలకు సారె పెట్టాలన్న ఆలోచనతో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని ముఖ్య మంత్రి కోరారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమం త్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీతక్క, దామోదర రాజ నర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి , కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీహరి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Latest