- జూబ్లీహిల్స్ విజయంలో కీలక పాత్ర
- మంత్రి పొంగులేటిని సత్కరించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్
హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం కృషి చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ బుధవారం రాష్ట్ర సచివాలయంలో జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. రెహమత్ నగర్, బోరబండ డివిజన్ల ఇన్‌ఛార్జిగా వ్యవహరించి మంచి ఆధిక్యత రావడానికి పొంగులేటి చేసిన కృషిని ప్రస్తావిస్తూ నవీన్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంచి ఆధిక్యతతో ఎన్నికైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను మంత్రి పొంగులేటి అభినందించారు.
Post Views: 26








