హైదరాబాద్, నవంబర్ 19, 2025 (బుధవారం) :
నవంబర్ 14న అట్టహాసంగా ప్రారంభమైన హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ వార్షిక శ్రీ బ్రహ్మోత్సవాలు బుధవారం భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా ముగిశాయి. ఆరు రోజుల పాటు కొనసాగిన ఈ ఉత్సవాలు భక్తజన హృదయాలను ఆహ్లాదంతో నింపి, ఆధ్యాత్మికంగా మైమరపించాయి.
ఉదయం మహా పూర్ణాహుతి, ఉత్సవర అభిషేకం, చక్రస్నానం కార్యక్రమాలతో దేవాలయ పరిసరాలు గోవింద నామస్మరణ మార్మోగాయి. సాయంత్రం దేవతా ఉద్యాసనం, శ్రీ పుష్ప యాగం అనంతరం శ్రీ రాధా గోవిందులు, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ నితాయి గౌరంగ, శ్రీల ప్రభుపాదుల వారికి మహా చూర్ణాభిషేకం ఘనంగా నిర్వహించబడింది. రాత్రి మహా సంప్రోక్షణ, మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగిశాయి.
ఈ సంవత్సరం, బ్రహ్మోత్సవాల్లో 108-కలశాల మహా చూర్ణాభిషేకం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వేద మంత్రోత్సవాలు, హరీనామ సంకీర్తనల నడుమ పవిత్ర కలశాలతో అభిషేకాలు నిర్వహించగా, దేవతలకు పంచామృతం, పంచగవ్య, ఫలరసాలు, వనమూలికల చూర్ణాలు, పుష్పాలు, ఔషధ ద్రవ్యాలు, నవరత్నాలతో స్నానాలు చేయించబడింది.
గంగా యమునా సహిత సప్త పవిత్ర నదుల జలంతో ప్రత్యేక స్నానం నిర్వహించగా, చివర్లో భక్తులపై పవిత్ర జలాలు కురిపించడం విశేషం.
ఈ సందర్భంగా మాట్లాడిన హరే కృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్, అధ్యక్షులు శ్రీమాన్ సత్య గౌర చంద్రదాస ప్రభూజీ (ఎం.టెక్ – IIT మద్రాస్), స్వామి వారి దివ్య అనుగ్రహంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి అని చెప్పారు. ఈ మేరకు సమాజానికి శాంతి, శ్రేయస్సుతో కూడిన ఆధ్యాత్మిక పురోగాభివృద్ధి చేకూరాలని ప్రార్థిస్తున్నాం” అని తెలిపారు.
ఈ కార్యక్రమాల విజయానికి సహకరించిన భక్తులకు, దాతలకు, సేవకులకు, వివిధ ప్రభుత్వ శాఖలకు, పోలీసులకు, మీడియా ప్రతినిధులకు ప్రభూజీ ధన్యవాదాలు తెలియజేశారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సీనియర్ భక్తులు, సంఘ సభ్యులు, శ్రేయోభిలాషులు భారీగా పాల్గొని భక్తి పరవశాన్ని పొందారు.
ఈ క్రమంలో భక్తుల కోసం ప్రత్యేకంగా ప్రసాదం పంపిణీ మరియు వివిధ సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి.
ధన్యవాదాలు & శుభాకాంక్షలు,
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ – పీఆర్ఓ
హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, రోడ్ నం.12, బంజారా హిల్స్, హైదరాబాద్
ఫోన్: 96400 86664 / 93964 16341 .








