Mahaa Daily Exclusive

  గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతున్నాం: డిప్యూటీ సీఎం

Share

  • రూ. 161 కోట్లు రిలీజ్ చేయండి
  • స్కాలర్‌షిప్ బకాయిల విడుదలకు భట్టి ఆదేశాలు
  • గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతున్నాం: డిప్యూటీ సీఎం

హైదరాబాద్, మహా: పెండింగ్ స్కాలర్‌షిప్ బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2813 జూనియర్, డిగ్రీ మరియు పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించిన రూ. 161 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి భట్టి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని పలు కాలేజీలు పెండింగ్ స్కాలర్ షిప్ బకాయిల కోసం పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలనే బంద్ కు కూడా పిలుపునివ్వగా… ప్రభుత్వం చర్చలు జరిపింది. దీంతో ఆయా కాలేజీలు వెనక్కి తగ్గాయి. చర్చల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2813 జూనియర్, డిగ్రీ,పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించిన పెండింగ్ స్కాలర్‌షిప్ బకాయిలు రూ. 161 కోట్లు వెంటనే విడుదల చేయాలని నిర్ణయించింది. ఆయా నిధులను వెంటనే విడుదల చేయాలని సూచించారు.

గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం..
గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓ ప్రకటన ద్వారా తెలిపారు. విద్యార్థులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా, కళాశాలలకు అవసరమైన నిధులు నిరంతరాయంగా చేరేలా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. కొద్దిరోజుల కిందట ఫీజు బకాయిలపై తెలంగాణలోని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు బంద్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే నవంబర్ మొదటి వారంలో ప్రభుత్వం… కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. ప్రజా భవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి ఆధ్వర్యంలో ఈ చర్చలు నిర్వహించారు. కాలేజీలతో జరిపిన చర్చలు సఫలం కావటంతో…. నవంబర్ 8వ తేదీ నుంచి కాలేజీలు తెరుచుకున్నాయి.

Latest