పాట్నా: బీహార్లో ఎన్డీయే విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్న ప్రధాని మోదీ, ‘గంచా మూమెంట్’ తీసుకొచ్చారు. మెడలోని కండువా తీసి తలపై గుండ్రంగా తిప్పుతూ గురువారం జనాన్ని ఉర్రూతలూగించారు. బిహార్ ముఖ్యమంత్రి నీతీష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రధాని ఉదయం నుంచీ చాలా ఉత్సాహంగా కనిపించారు. వేదిక వద్దకు చేరుకునే సందర్భంలో కూడా ప్రధాని తన కండువా గాల్లో ఊపుతూ అక్కడికి చేరుకున్న ప్రజల్ని ఉత్సాహపరిచే యత్నం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు.
Post Views: 21








