Mahaa Daily Exclusive

  అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల కక్కుర్తి..

Share

  • అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల కక్కుర్తి
  • ఉచితంగా స్థలాలు పొంది తక్కువ పన్ను చెల్లిస్తున్న వైనం
  • అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా నోటీసులు

హైదరాబాద్, మహా : అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు బల్దియా బిగ్‌షాక్ ఇచ్చింది. ట్రేడ్ లైసెన్స్‌ ఫీజుకు సంబంధించి రెండు స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఈ రెండు స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్లు బల్దియా గుర్తించింది. అలాగే వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నుల ఎగవేతకు పాల్పడినట్లు బయటపడింది. దీంతో పూర్తి స్తాయిలో ట్రేడ్ లైసెన్స్‌ ఫీజు చెల్లించాలంటూ రెండు స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు పంపారు.

అన్నపూర్ణ స్టూడియో రూ. 11.52 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ. 49 వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లు తేలింది. అలాగే రూ. 1.92 లక్షలు చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియోస్ కేవలం రూ. 1900 మాత్రమే చెల్లిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ సర్కిల్ 18 అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా అధికారులు నోటీసులు జారీ చేశారు.