Mahaa Daily Exclusive

  నన్ను అరెస్టు చేసే దమ్ము రేవంత్ కు లేదు:మాజీ మంత్రి కేటీఆర్

Share

  • నేను ఏ తప్పూ చేయలేదు
  • నన్ను అరెస్టు చేసే దమ్ము రేవంత్ కు లేదు
  • లైడిటెక్టర్‌‌ టెస్ట్‌కి సిద్ధం
  • మాజీ మంత్రి కేటీఆర్

హైదరాబాద్, మహా : ఫార్ములా ఈ కారు రేసు కేసులో నా తప్పేమీ లేదని, ననన్ు అరెస్టు చేసే ధైర్యం రేవంత్ ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ కేసులో ఏ1గా విచారణ ఎదుర్కుంటున్న కేటీఆర్ విచారించేందుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అనుమతించిన నేపథ్యంలో శుక్రవారం కేటీఆర్ స్పందిస్తూ చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. చేసుకుపోనివ్వండి అని అన్నారు. ఫార్ములా ఈ రేసింగ్‌లో తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. తప్పు చేయలేదని ఇప్పటికీ 100 సార్లు చెప్పా, ఏ విచారణకైనా సిద్దమని కూడా స్పష్టం చేశా అని అన్నారు. ఈ వ్యవహరంపై లై డిటెక్టర్‌ టెస్ట్‌కు కూడా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. లేని అంశాన్ని ఉన్నట్లు చూపించి రేవంత్ ప్రభుత్వం తనను ప్రజల్లో చులకన చేసేందుకు ప్రయత్నిస్తుంది తప్ప మరోటి కాదన్నారు. విచారణకు పిలిస్తే వెళ్తా, మరోమరు జరిగింది ఏమిటో చెబుతా అని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్, బీజేపీలు నడిపిస్తున్నాయి

కాంగ్రెస్, బీజేపీలు కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. మళ్ళీ మేం ప్రభుత్వంలోకి వస్తాం, లెక్కలన్నీ తేలుస్తామన్నారు. ఈ కార్ రేసింగ్ కేసులో ఏమీ లేదని రేవంత్‌కు కూడా తెలుసన్నారు. దానం నాగేందర్‌తో రాజీనామా చేపించి..‌ కడియంను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ గుర్తుపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి దానం దొరికిపోయారన్నారు. అనర్హత వేటు పడితే పరువు పోతుందని రాజీనామా చేపిస్తున్నారన్నారు. సాకేంతిక సాకులు చూపి కడియంను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

ఖైరతాబాద్ ఉప ఎన్నిక కంటే ముందే గ్రేటర్ ఎన్నికలు

ఖైరతాబాద్ ఉప ఎన్నిక కంటే ముందే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వస్తాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో సత్తా ఏమిటన్నది తేల్చుకుంటామన్నారు. ఒక్క ఉప ఎన్నకలో గెలవగానే సరిపోదని మెజారిటీ ప్రజల మనోభావాలేమిటన్నది గుర్తించాలన్నారు.