మహా, నడిగూడెం:
విద్యార్థులు మంచి ఆలోచన దృక్పథాన్ని అలవరసుకోవాలని, చదువుతో పాటు వారి ఎదుగుదలకు ప్రతిభా పాఠవ పరీక్షలతో పాటు శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించుకోవాలని ఎంఈఓ బి.ఉపేందర్ రావు కోరారు. శుక్రవారం
నడిగూడెం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జన విజ్ఞాన వేదిక సూర్యాపేట జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి ప్రతిభ పాఠవ పరీక్షల సంబరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్యార్థులలో శాస్త్రీయ దృక్పందాన్ని, సృజనాత్మకత ఆలోచనల రూపకల్పనకు ఈ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు ఆర్.శ్రీదేవి మాట్లాడుతూ ఈ పోటీ పరీక్షలు సైన్స్ పట్ల విద్యార్థులకు ఆసక్తిని పెంపొందిస్తాయని, చిన్నారుల సమపార్జన విజ్ఞాన వారదిగా చెక్ ముఖి ప్రతిభా పరీక్ష పోటీలు ఉపయోగపడతాయన్నారు. విద్యార్థుల ప్రతి పని గుర్తించి, వారి చైతన్యానికి కృషి చేస్తున్న జన విజ్ఞాన వేదిక సభ్యులను అభినందించారు. ఇంగ్లీష్ మీడియం విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గురుకుల పాఠశాల నడిగూడెం విద్యార్థులు బహుమతి గెలుచుకోగా, తెలుగు మీడియం విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రత్నవరం విద్యార్థులు బహుమతి గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు
మేరాజుద్దీన్, మధుసూదన్ రెడ్డి, సుబ్బారావు, నరేందర్, యాదగిరి, మంజుల. విజయ, వి ఎల్ ఎన్ చారి, అనిత, హరిత, సిఆర్పి గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.








