Mahaa Daily Exclusive

  బీసీ జాతి కోసమే నా పోరాటం:ఆర్. కృష్ణయ్య

Share

  • బీసీ జాతి కోసమే నా పోరాటం
  • ఏ నాయకుడికి లొంగకుండా ఉద్యమాలు చేస్తున్నా
  •  రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్, మహా: నా చివరి రక్తం బొట్టు ఉన్నంత వరకు బీసీ జాతి కోసం పోరాటం చేస్తానని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. బీసీ ఐకాస చైర్మన్ ఆర్. కృష్ణయ్య అధ్యక్షతన లక్డీకాపూల్ లోని ఓ హోటల్ లో భవిష్యత్ కార్యాచరణపై బీసీ కుల సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సినీ దర్శకుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి, దర్శకుడు శంకర్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ తో పాటు పలువురు బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. పదవులు, ప్రయోజనాల కోసం ఏ రాజకీయ నాయకుడికి లొంగకుండా కేవలం భవిష్యత్తు బీసీ తరాల కోసం ఉద్యమాలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ఉద్యమంలో అనేక లోటుపాట్లు, వెన్నుపోటులు, కుట్రలు, పేదరికం, బలహీనతలు ఉంటాయని, వాటిని ఎదుర్కొంటూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తున్నట్లు తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మరిందో… బీసీ ఉద్యమం మారాలని.. అప్పుడే 42 శాతం రిజర్వేషన్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా కూడా దేశవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు. బీసీలు అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అని, బ్రిటిష్ కాలం నుండి బీసీ లపై కుట్రలు ఇంకా జరుగుతున్నాయని, సినీ దర్శక నిర్మాతల ఆర్ నారాయణ మూర్తి ఆరోపించారు.